నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

First Published | Dec 8, 2023, 6:09 PM IST

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు కూడ గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించిన వారే.

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి  ముఖ్యమంత్రులుగా  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  రెండు దఫాలు పనిచేశారు. ఈనెల  7వ తేదీన తెలంగాణకు  ముఖ్యమంత్రిగా  అనుముల రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టారు.  వీరిద్దరూ కూడ గతంలో  తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు. అయితే వేర్వేరు మార్గాల్లో వీరిద్దరూ  తెలంగాణ రాష్ట్రానికి సీఎంలయ్యారు. 

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

2014 జూన్  2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తొలి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2018 ఎన్నికల్లో  కూడ రెండో దఫా  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.  దరిమిలా కేసీఆర్  రెండో దఫా  అధికారాన్ని కైవసం చేసుకున్నారు.  
 

Latest Videos


నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

2001లో  కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.  తెలంగాణ రాష్ట్ర సమితే  నేడు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన విషయం తెలిసిందే. 2001లో  కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయకముందు  తెలుగుదేశం పార్టీలో  కేసీఆర్ కీలకంగా  పనిచేశారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో  కేసీఆర్  మంత్రిగా పనిచేశారు. 1983లో కేసీఆర్  తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీలో ఆయన  క్రియాశీలకంగా  వ్యవహరించారు.

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

1983 నుండి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా  పనిచేశారు.   తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చే విషయంలో  ఆనాడు  కేసీఆర్ కీలకంగా వ్యవహరించేవారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  ఆరు మాసాలకు, ఏడాదికి ఒక్కసారి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
 

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

1999లో చంద్రబాబు నాయుడు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రెండో దఫా  అధికారాన్ని చేపట్టారు. ఆ సమయంలో  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఇతరత్రా కారణాలతో  కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2001 ఏప్రిల్ మాసంలో కేసీఆర్  తెలంగాణ  రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ గా  మార్చారు. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు తీసుకెళ్లారు. తెలంగాణలో తొలిసీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 
 

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు.1992లో విద్యార్ధి దశలో ఏబీవీపీలో పనిచేశారు. 2006లో  ఇండిపెండెంట్ గా మిడ్జిల్ నుండి జడ్ పీ టీ సీగా విజయం సాధించారు.  2008 మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత  రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.2009, 2014 ఎన్నికల్లో  కొడంగల్ నుండి  టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసి విజయం సాధించారు. 

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి

2014లో టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.చంద్రబాబుకు  రేవంత్ రెడ్డి  అత్యంత సన్నిహితుడనే పేరుంది.  2015లో  ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు.ఈ కేసులో తనను ఇరికించారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  తెలుగుదేశం పార్టీలో  రేవంత్ రెడ్డి  కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి  పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీలో  పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ విజయంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 

నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి


గతంలో వీరిద్దరూ  తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అయితే  తమ లక్ష్యాల కోసం వీరిద్దరూ వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనను ఎంచుకొన్నారు. తెలంగాణకు సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి  కాంగ్రెస్ లో చేరి  కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా  పోరాడి  తెలంగాణ సీఎం అయ్యారు.

click me!