Kalvakuntla Kavitha: కేసీఆర్ పిలిస్తే మ‌ళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తారా.? క‌విత స‌మాధానం ఏంటంటే.?

Published : Oct 10, 2025, 06:29 PM IST

Kalvakuntla Kavitha: ఇటీవల యూట్యూబ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లనని ప్రకటించారు. కేసీఆర్ వ్యక్తిగతంగా పిలిచినా.. తన మాటలో మార్పు లేదని తేల్చి చెప్పారు.    

PREV
15
కేసీఆర్ పిలిచినా.. నా మాటలో మార్పులేదు

సొంత పార్టీనే కాకుండా, కుటుంబ సభ్యులను కూడా వ్యతిరేకించారు కల్వకుంట్ల కవిత. అయితే ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన కవిత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యక్తిగతంగా తనను తిరిగి పార్టీలోకి రమ్మని పిలిచినా.. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్లనని అన్నారామె. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. 

25
కూతుళ్లు ఎప్పుడూ పగ పెంచుకోరు

కూతుళ్లు ఎప్పుడూ తల్లిదండ్రులపై పగ పెంచుకోరని చెప్పిన ఆమె.. వారికి ఏదైనా గాయం అయితే.. అది ఎక్కువ కాలం గుర్తుండిపోతుందని కవిత అన్నారు. కేటీఆర్, కేసీఆర్ సహా తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తాను ఎప్పుడూ సిద్దమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇప్పుడు బీఆర్‌ఎస్‌‌తో కూడా దూరం పాటిస్తానని ఆమె పేర్కొన్నారు.

35
కుటుంబ బంధాల కంటే రాజకీయాలే వారికి ముఖ్యం

తీన్మార్ మల్లన్న తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ మౌనంగా ఉండటం తనను తీవ్రంగా బాధించిందని ఆమె చెప్పారు. కుటుంబ బంధాల కంటే రాజకీయాలే వారికి ముఖ్యమని అప్పుడు గ్రహించానని కవిత స్పష్టం చేశారు. పార్టీని వీడినప్పటి నుంచి తాను కేసీఆర్‌తో మాట్లాడలేదని, ప్రతిరోజూ తన తల్లితో మాట్లాడుతూనే ఉన్నానని ఆమె అన్నారు.

45
కొత్త పార్టీకి అవి ముఖ్యం..

కొత్తపార్టీ ప్రారంభించడానికి వ్యక్తులు, నిధులు రెండూ అవసరమని, సరైన సమయం కోసం తాను ఎదురు చూస్తున్నానని కవిత అన్నారు. బీజేపీ తనను జైలుకు పంపినప్పుడు పార్టీ తనను ఎలా దూరం పెట్టిందో గుర్తుచేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అలాగే అప్పుడు తన కుటుంబం మాత్రమే తనకు మద్దతు ఇచ్చిందని కల్వకుంట్ల కవిత చెప్పారు.

55
20 స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉన్నట్లయితే..

ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి చాలామంది నాయకులు కేసీఆర్‌తో సమస్యలను లేవనెత్తిన తర్వాతే.. వారిని దూరం పెట్టారని కవిత చెప్పారు. బీఆర్ఎస్ 20 స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉన్నట్లయితే.. ఈ ఘోర పరాభవాన్ని ఎదుర్కునేది కాదని ఆమె అన్నారు. మొత్తం కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు దారి తీశాయి. 

Read more Photos on
click me!

Recommended Stories