School Holidays : బోనాలు, మొహర్రం సెలవులకు ఇవి ఎక్స్ట్రా .. జూలైలో తెలుగు స్టూడెంట్స్ కి ఎన్నిరోజుల హాలిడేసో తెలుసా?

Published : Jun 24, 2025, 02:34 PM ISTUpdated : Jun 24, 2025, 02:42 PM IST

తెలంగాణ విద్యార్థులకు జూలైలో బాగానే సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో కొన్ని ప్లాన్డ్ సెలవులు వస్తుండగా మరికొన్ని సడన్ హాలిడేస్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా వచ్చేనెలలో ఎన్ని సెలవులు వస్తాయంటే… 

PREV
16
తెలంగాణ విద్యార్థులకు జూలైలో వచ్చే సెలవులెన్ని?

July Holidays : తెలుగు విద్యార్థులకు వేసవి సెలవులు ముగిసి అప్పుడే పది రోజులు గడిచిపోయింది. జూన్ నెల ముగింపుకు చేరుకుంది... మరో వారం గడిస్తే జూలై లోకి అడుగుపెడతాం. వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేసిన పిల్లలు సడన్ గా స్కూళ్లు ప్రారంభం కావడంతో కాస్త భారంగానే వెళుతున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ కి ఈ జూన్ నిరాశే మిగిల్చింది... ఈ నెలలో ఆదివారాలు మినహా విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవులేమీ రాలేవు.

అయితే జూలైలో మాత్రం తెలుగు విద్యార్థులకు ప్రత్యేక సెలవులు రానున్నాయి. తెలంగాణవ్యాప్తంగా దాదాపు జూలై నెలంతా బోనాల వేడుకలు సాగనున్నాయి... ముఖ్యంగా హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్నాయి. అలాగే మొహర్రం పండక్కి కూడా సెలవులు రానున్నాయి. ఇక ఆదివారాలు, రెండో శనివారం సెలవులు ఎలాగూ ఉన్నాయి. ఇలా జూలైలో తెలంగాణ విద్యాసంస్థలకు వస్తున్న సెలవుల గురించి తెలుసుకుందాం.

26
మొహర్రం సెలవు

జూలై ఆరంభంలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మొహర్రం పండగ ఉంది. అయితే ఇది జూన్ 6న అంటే ఆదివారం వస్తోంది... కాబట్టి ఆరోజు పండగ లేకున్నా సెలవే. కానీ జూన్ 5న శనివారం అంటే మొహర్రం ముందురోజును (9TH మొహర్రం) కూడా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. దీంతో కొందరు విద్యార్థులు జూన్ 5న సెలవు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

36
ఆ ప్రాంతాల్లో మొహర్రంకు స్పెషల్ సెలవు?

మొహర్రం పండగ తెలంగాణలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుంది... ఇది ముస్లింల పండగే అయినా హిందువులు కూడా జరుపుకుంటారు. హిందూముస్లింలు కలిసి మొహర్రంను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి ముస్లింలు అత్యధికంగా ఉండే హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులకు మొహర్రం సెలవు ఉంటుంది... ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు జూన్ 5 ఆప్షనల్ హాలిడేను సెలవుగా ప్రకటించే అవకాశాలున్నాయి.

46
బోనాల పండక్కి సెలవు

ఇప్పటికే ఆషాడమాసం మొదలయ్యింది... జూన్ 26(గురువారం) గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల వేడుకలు షురూ కానున్నాయి. ఇలా వరుసగా బల్కంపేట, సికింద్రాబాద్, చివర్లో హైదరాబాద్ బోనాలు జరగనున్నాయి. అయితే ఆషాడమాసం చివరి ఆదివారం హైదరాబాద్ నగరమంతా బోనాలు జరుపుకోనున్నారు... ఆ తర్వాతిరోజు (జూలై 21) సోమవారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది.

56
సికింద్రాబాద్ స్టూడెంట్స్ కి ప్రత్యేక సెలవులుంటాయా?

ఇక సికింద్రాబాద్ లోని ఉజ్జయిన మహంకాళి అమ్మవారికి జూలై 13న బోనాలు సమర్పించనున్నారు. ఈ సమయంలో లక్షలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తాయి. కాబట్టి ఈ బోనాల సమయంలో జూలై 12 లేదంటే జూలై 14న సికింద్రాబాద్ ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ సెలవుపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

66
ఆదివారాలు, రెండో శనివారం సెలవులు

జూలైలో పండగ సెలవులు కాకుండా నాలుగు ఆదివారాలు, ఓ రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు వస్తోంది. అంటే ఐదురోజులు సాధారణ హాలిడేస్, ఓ పండగ హాలిడే, ఇంకో ఆప్షనల్ హాలిడే కలిపి జూలైలో మొత్తంగా ఏడురోజులు సెలవులు వస్తున్నాయి.

ఇక జూలైలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసినా, వరద పరిస్థితులున్నా సెలవులు ఇస్తారు. ఇక బంద్ లు, ఆందోళనలు ఏమైనా ఉన్నా సెలవులు వస్తాయి. ఇలా వచ్చే నెలలో సడన్ హాలిడేస్ ఏమైనా వస్తే అదనం. జూన్ లో వేసవి సెలవులు ముగిసాక అసలు సెలవులేమీ రాలేవు... కనీసం జూలైలో అయినా ఒకట్రెండు ప్రత్యేక సెలవులు వస్తున్నాయి.. అది చాలు అనుకుంటున్నారు తెలంగాణ విద్యార్ధులు.

Read more Photos on
click me!

Recommended Stories