బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

First Published | Jul 30, 2023, 3:37 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  జిట్టా బాలకృష్ణారెడ్డి రంగం సిద్దం  చేసుకుంటున్నారు.  ఇటీవలనే  జిట్టా బాలకృష్ణారెడ్డిపై బీజేపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది. 

బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  జిట్టా బాలకృష్ణారెడ్డి రంగం సిద్దం  చేసుకుంటున్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  భువనగిరి  అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టుపై  జిట్టా బాలకృష్ణారెడ్డి  పోటీ చేసేందుకు రంగం సిద్దం  చేసుకుంటున్నారు. ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ  జిట్టా బాలకృష్ణారెడ్డి చేరిక విషయమై సానుకూలంగా సంకేతాలు ఇచ్చారనే ప్రచారం కూడ సాగుతుంది. 

బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డీసీసీ  అధ్యక్షుడు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం.  ఏడాది క్రితం  యువ తెలంగాణ పార్టీని జిట్టా బాలకృష్ణారెడ్డి  బీజేపీలో విలీనం చేశారు.  బీజేపీ క్రియాశీలకంగా  పనిచేస్తున్నారు.  బండి సంజయ్  బీజేపీ అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  పలు  కార్యక్రమాలు నిర్వహించారు. ఘట్ కేసర్ లో  నిర్వహించిన తెలంగాణ ధూం ధాం కార్యక్రమంపై జిట్టా బాలకృష్ణారెడ్డిపై  కేసు కూడ నమోదైన విషయం తెలిసిందే. 


బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

ఇటీవల కాలంలో  బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై  జిట్టా బాలకృష్ణారెడ్డి  విమర్శలు  చేశారు.   ఈ విమర్శల నేపథ్యంలో జిట్టా బాలకృష్ణారెడ్డిపై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. బీజేపీ నాయకత్వంపై  విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీపై కొంత సానుకూలంగా  ప్రకటనలు చేశారు.  ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకత్వం  సీరియస్ గా తీసుకుంది.  ఈ నెల  26వ తేదీన జిట్టా బాలకృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటేసింది. 

బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

గతంలో భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి  జిట్టా బాలకృష్ణారెడ్డి  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.త్వరలోనే  అనుచరులతో సమావేశమై  భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా  జిట్టా బాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  జిట్టా బాలకృష్ణారెడ్డి  పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో  పార్టీ నాయకత్వం  ఆయనపై  సస్పెన్షన్ వేటేసింది.

బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైన నేతగా  జిట్టా బాలకృష్ణారెడ్డికి పేరుంది.  భువనగిరి అసెంబ్లీ టిక్కెట్టు దక్కకోవడంతో  జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి  పలు దఫాలు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కానీ  ఆయనకు విజయం దక్కలేదు. అయితే  ఈ దఫా  కాంగ్రెస్ పార్టీ ద్వారా  పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. 

బీజేపీ సస్పెన్షన్: కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

2009 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన  జిట్టా బాలకృష్ణారెడ్డిపై ఉమా మాధవరెడ్డి  విజయం సాధించారు.2014లో  కూడ  బీఆర్ఎస్ అభ్యర్థి  పైళ్ల శేఖర్ రెడ్డి  యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన  జిట్టా బాలకృష్ణారెడ్డిపై విజయం సాధించారు.  2018లో  యువ తెలంగాణ పార్టీపై  పోటీ చేసిన  జిట్టా బాలకృష్ణారెడ్డికి కేవలం  13427 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు.

Latest Videos

click me!