జనవరి 2025 లో సెలవులు :
వచ్చే ఏడాది ఆరంభమే సెలవులతో ప్రారంభం అవుతోంది. జనవరి 1, 2025 (బుధవారం) నూతన సంవత్సరాది సందర్భంగా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఆరోజు విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు... కుటుంబంతో లేదంటే స్నేహితులతో హాయిగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవచ్చు. అయితే ఈరోజుకు బదులు జనవరి 11 రెండో శనివారం సెలవులు రద్దుచేసారు. ఆ రోజు విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి.
ఇక సరిగ్గా ఈ నెల మధ్యలో సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులకు ఆదివారం కలిసిరావడంతో లాంగ్ వీకెండ్ వస్తోంది. జనవరి 13 సోమవారం భోగి, జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు. ఆ తర్వాతిరోజు జనవరి 15 కనుమకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అదేరోజు హజ్రత్ అలీ బర్త్ డే సందర్భంగా కూడా విద్యార్థులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ సర్కార్.
ఇలా జనవరి 12 నుండి 15 వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చాయి. ఈ సెలవులు హైదరాబాద్ లో వుండే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునే ఆ ప్రాంత ప్రజలు సొంతూళ్లకు వెళ్లిరావడానికి ఈ సెలవులు కలిసివస్తాయి. ఇలా వారు సొంతూల్లో సొంతోళ్లతో కలిసి హాయిగా సంక్రాంతి జరుపుకోవచ్చు.
ఇలా సంక్రాంతి సెలవుల తర్వాత ఇదే జనవరిలో మరో సెలవు వస్తుంది. షబ్-ఈ-మేరాజ్ సందర్భంగా తెలంగాణ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అంటే ఆరోజు కూడా కావాలనుకుంటే విద్యార్థులు సెలవు తీసుకోవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జాతీయ సెలవు. అయితే ఆరోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవుతో కలిసిపోయింది.