కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి లేఖల కలకలం: పాదయాత్రకు అనుమతికై ఠాక్రేకు లేఖ

First Published | Apr 28, 2023, 3:26 PM IST

 రాష్ట్రంలోని  47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పాదయాత్ర  చేసేందుకు  అనమతిని  కోరారు జగ్గారెడ్డి.  ఈ మేరకు  ఇవాళ  మాణిక్రావు  ఠాక్రేకు  లేఖ  రాశారు. 

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జీ  మాణి క్ రావు ఠాక్రేకు  సంగారెడ్డి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి  శుక్రవారంనాడు లేఖ రాశారు.  తన పాదయాత్రకు  అనుమతివ్వాలని జగ్గారెడ్డి   ఆ లేఖలో  కోరారు. రాష్ట్రంలోని  47 అసెంబ్లీ  నియోజకవర్గంలోపాదయాత్ర  చేసేందుకు  అనుమతివ్వాలని జగ్గారెడ్డి  ఆ లేఖలో  కోరారు. 

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

తెలంగాణ  రాష్ట్రంలో ప్రస్తుతం  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  సాగుతుంది.  ఈ ఏడాది మే  8 నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  రెండో విడత  పాదయాత్ర ప్రారంభించనున్నారు.  ఈ తరుణంలో  జగ్గారెడ్డి  తాను  పాదయాత్ర  నిర్వహిస్తానని  మాణిక్ రావు  ఠాక్రేకు  లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది

Latest Videos


పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

రాహుల్ గాంధీ  నిర్వహించిన  భారత్ జోడో యాత్రకు  కొనసాగింపుగా  ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ నేతలు  హత్ సే హత్ జోడో  అభియాన్ పేరుతో  పాదయాత్రలు  చేయాలని కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం ఆదేశాలు  జారీ చేసింది.  

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

దీంతో  ఈ ఏడాది ఫిబ్రవరి  6న మేడారంలో  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు.  గత మాసంలో  రేవంత్ రెడ్డి  తన పాదయాత్రకు  బ్రేక్ ఇచ్చారు.  మే 9వ తేదీ నుండి జోగులాంబ ఆలయం నుండి  పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా  రేవంత్ రెడ్డి  ప్రకటించారు.

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ


మరో వైపు  సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క   ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా  నుండి ఖమ్మం  వరకు  పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం  ఉమ్మడి వరంగల్ జిల్లాలో  భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. 

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి  పాదయాత్రకు  అనుమతి కోరుతూ  మాణిక్ రావు ఠాక్రేకు లేఖ రాశారు.  హైద్రాబాద్ సహా  రాష్ట్రంలోని  47 నియోజకవర్గాల్లో  పాదయాత్ర  చేస్తానని  ఆయన   ఆ లేఖలో  పేర్కొన్నారు.  మెదక్,  రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో  పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా  జగ్గారెడ్డి  ప్రకటించారు

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

రెండు మూడు రోజులుగా  జగ్గారెడ్డి  లేఖాస్త్రాలను సంధిస్తున్నారు.  ఇవాళ  47  నియోజకవర్గాల్లో  పాదయాత్రకు  జగ్గారెడ్డి  అనుమతి కోరడం   రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకుంది. అయితే  జగ్గారెడ్డి  లేఖపై  మాణిక్ రావు  ఠాక్రే  ఎలా స్పందిస్తారనేది  కాంగ్రెస్ లో  ఆసక్తి నెలకొంది.  

పాదయాత్రకు జగ్గారెడ్డి లేఖ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కూడా  పాదయాత్ర లేదా బస్సు యాత్ర  చేస్తానని ప్రకటించారు కానీ ప్రస్తుతం  ఈ విషయమై  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  మాట్లాడడం లేదు.  

click me!