నవంబర్ 28, 2019 ఉదయం.. ఈ ఘటన తెల్లవారి వెలుగుతో పాటే బయటి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఆ పాశవిక దారుణ కాండతో ఉలిక్కి పడ్డారు. ఆ దారుణం మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి దిశను Assassination చేసింది నలుగురు యువకులని తేలింది.
దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. dishaను న్యాయం చేయాలంటూ ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. నవంబర్ 29 న.. Veterinary Doctor దిశ కేసులో సైబరాబాద్ పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ లు గుర్తించారు. నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తారని గుర్తించారు.