బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

First Published | Oct 25, 2023, 2:21 PM IST

ఎన్నికల సమయంలో బీజేపీకి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో  చర్చకు దారి తీసింది.  రానున్న రోజుల్లో మరికొందరు నేతలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ చెబుతుంది.

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

ఎన్నికల సమయంలో బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి రాజకీయంగా  ఇబ్బంది కలిగించే పరిణామంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు . అదే సమయంలో  బీజేపీ నుండి  అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరడం  రాజకీయంగా  ఆ పార్టీకి  కలిసొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

కోమటిరెడ్డి  బ్రదర్స్ కు  ఉమ్మడి నల్గొండ జిల్లాలో  మంచి పట్టుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీ ద్వారానే  రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  కాంగ్రెస్ అభ్యర్ధిగా  భువనగిరి ఎంపీగా, ఎమ్మెల్సీగా  పనిచేశారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో  కోమటిరెడ్డి బ్రదర్స్ కు  మంచి పట్టుంది. 

Latest Videos

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రాతినిథ్యం వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సతీమణి  ఎమ్మెల్సీగా పోటీ చేసి  ఓటమి పాలయ్యారు

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో  కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి  బీజేపీలో చేరడం బీజేపీకి రాజకీయంగా  కలిసి వచ్చింది. అయితే  బీజేపీలో  చోటు చేసుకున్న పరిణామాలపై  ఆ పార్టీ నేతల్లో కొందరు అసంతృప్తితో  ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. కొందరు నేతలు  రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్టుగా మీడియా రిపోర్టు చేసింది. 

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

ఈటల రాజేందర్ కు  బీజేపీ నాయకత్వం  పెద్ద పీట వేయడం కూడ  కొందరు నేతలకు  నచ్చడం లేదనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈటల రాజేందర్ కు  రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ రెండు అసెంబ్లీ స్థానాలను కోరారుకానీ బీజేపీ నాయకత్వం  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పేరును తొలి జాబితాలో  ప్రకటించలేదు

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యాన్ని కూడ దృష్టిలో ఉంచుకొని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీని వీడారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీని  వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడం  రాజకీయంగా ఆ పార్టీకి  కలిసి వస్తుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కాంగ్రెస్ కు ఏ రకంగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక కలిసి వస్తుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

click me!