రేవంత్ రెడ్డి గురించి ఆయన భార్య చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు

First Published | Dec 6, 2023, 12:59 PM IST

రేవంత్ రెడ్డి ఓ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. బై ఛాన్స్ కాదు బై చాయిస్ వచ్చారు. ఆయనను వెనకకి లాగడం ఎందుకు అంటారు గీతారెడ్డి.

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అందమైన పొదరిల్లు లాంటి కుటుంబం. భార్య పేరు గీతారెడ్డి. వీరిది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. అయితే గీతారెడ్డి గురించి.. ఆమె ఎంత స్ట్రాంగో.. రేవంత్ రెడ్డికి ఆమె ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుందో దగ్గరి వాళ్లకు తప్ప పెద్దగా ఎవ్వరికీ తెలియదు. 

గీతారెడ్డి, రేవంత్ రెడ్డిలు ఇష్టపడి, ప్రేమించి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్టూడెంట్ గా ఉన్న సమయంలోనే గీతారెడ్డితో ప్రేమలో పడ్డారు. గీతారెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కూతురు. అప్పటికి రేవంత్ రెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. వీరి ప్రేమ సంగతి తెలిసి గీతారెడ్డి తండ్రి మొదట వీరి ప్రేమను అంగీకరించలేదు. 


కూతురిని ఇక్కడే ఉంచితే.. రేవంత్ తో వెళ్లిపోతుందని.. ఢిల్లీకి జైపాల్ రెడ్డి దగ్గరికి పంపారట. అది ఎలాగో తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జైపాల్ రెడ్డితో పరిచయం పెంచుకుని.. తమ ప్రేమ విషయం మాట్లాడి, ఒప్పించారట. మాటల మరాఠీ అయిన రేవంత్ రెడ్డితో సంభాషణ జైపాల్ రెడ్డికి నచ్చింది. కన్వీన్స్ అయ్యారు. 

అప్పుడే ఆయనకు రేవంత్ లో ఫ్యూచర్ పొలిటీషియన్ కనిపించాడు. రేవంత్ రెడ్డి ధైర్యం నచ్చింది. టాలెంట్ ఇంప్రెస్ చేసింది. దీంతో తమ్ముడిని ఒప్పించి, దగ్గరుండి వీరిద్దరి పెళ్లి చేశారట. ఒకే సామాజిక వర్గం కావడంతో కూడా కాదనడానికి ఏం లేకుండా పోయిందని చెబుతారు. అలా 1992లో వీరిద్దరూ ఒకటయ్యారు. 

రాజకీయాలు మానేయమని అడగలేదా అని ఆయన భార్య గీతారెడ్డిని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం ఎంత బాగుందంటే.. రేవంత్ రెడ్డి ఓ లక్ష్యంత రాజకీయాల్లోకి వచ్చారు. బై ఛాన్స్ కాదు బై చాయిస్ వచ్చారు. ఆయనను వెనకకి లాగడం ఎందుకు అన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి చాలా రోజులు చర్లపల్లి జైలులో పెట్టిన తరువాత.. ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చాలా దైర్యంగా ఈ సమాధానం చెప్పారు. 

భయమేయట్లేదా అని అడిగితే.. ఇంతకంటే ఏముంటుంది అని అడిగారు. ఏమైనా ఆయనతో పాటే అంటూ సహధర్మచారిణిగా తన బాధ్యతను ప్రేమగా వ్యక్తం చేశారు. వారిద్దరిదీ ప్రేమ వివాహాం కాబట్టి.. అలా ప్రేమించి, పెళ్లి చేసుకుని రాంగ్ చేశానా? అని అనిపించిందా.. అంటే.. ఆయన పడే కష్టం ముందు మనమెంతా? అని ఎదురు ప్రశ్నిస్తారామె. ఆయనకు సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేం కదా.. అంత చేసినా చాలు కదా అంటారు. 

Revanth reddy wife

గీతారెడ్డి డిగ్రీ చదువుకున్నారు. రేవంత్ తో ఇంటర్ చదివే సమయంలో పరిచయం అయ్యింది. రేవంత్ రెడ్డిలో ఆమెకు ముక్కుసూటితనం నచ్చుతుందట. గీతారెడ్డి తల్లిగారికి రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టమట. ఇక రేవంత్ రెడ్డి ముందు ప్రిపేర్ అవ్వకుండా ఏదీ మాట్లాడరట. మీడియా ముందు కానీ, విలేకరుల సమావేశం కానీ.. అసెంబ్లీ అయినా ఏదైనా సరే.. ఆ విషయం మీద పూర్తిగా అవగాహన పెంచుకున్నాకే మాట్లాడతారట.

దీనికి గీతారెడ్డి కూడా సాయం చేస్తానని చెప్పారు. విమర్శలు వచ్చినప్పుడు తన దూకుడు తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. కానీ ఎవరైనా తనని అపార్థం చేసుకుంటారేమో అనే భయం కొంచెం ఉంటుంది అంటారు. 

Latest Videos

click me!