రేవంత్ రెడ్డి కూతురిని చూశారా?

First Published | Dec 6, 2023, 11:49 AM IST

రేవంత్ రెడ్డి కూతురు నైమిషారెడ్డి డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. 

రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంతో కీలకంగా పనిచేసిన యువనేత. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి. పాలమూరు ముద్దుబిడ్డ. ఆయనకు తెలంగాణతో ఎంత అనుబంధం ఉందో.. రాజకీయాల మీద ఎంత ప్రేమ ఉందో.. అంతకంటే ఎక్కువ అనుబంధం.. ప్రేమలు తన కూతురంటే..

రేవంత్ రెడ్డి కూతురి పేరు నైమిషా రెడ్డి. ఆయనకు ఆమె ఒక్కతే సంతానం. చిన్నప్పటినుంచి కూతురంటే ఎంతో గారాబం. రేవంత్ రెడ్డి మిగతా రాజకీయనాయకుల్లా కాదు. కుటుంబానికి ప్రత్యేక సమయం కేటాయిస్తారు.


ఎంత బిజీగా ఉన్నా.. భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డిలే తన లోకం. వారితో సినిమాలకు, డిన్నర్ లకు వెడుతుంటారు. వారికి ఇవ్వాల్సిన క్వాలిటీ సమయం ఇస్తారు. ఏ విషయం అయినా ముగ్గురూ చర్చించుకుంటారు. వాదోపవాదులు సరదగాగా నడుస్తాయట.

ముఖ్యంగా కూతురు అంటే వల్లమాలిన ప్రేమ. దీనికి కారణం తనది ప్రేమ వివాహం కావడం. తమ ప్రేమకు ప్రతిరూపంగా ఆ అమ్మాయి కావడం కూడా. అందుకే బిడ్డ పెళ్లి సమయంలో తాను చర్లపల్లి జైల్లో ఉండడాన్ని రేవంత్ తట్టుకోలేకపోయాడు. ఎంగేజ్మెంట్కు జైలునుంచి నేరుగా రావడం.. బంధువులతో మాట్లాడే అవకాశం లేని నిబంధనలతో బాగా ఇబ్బంది పడ్డారు. 

తన ఇంట్లో చేసుకునే మొదటి వేడుకకు తానిలా అయిపోయానని ఆ సమయంలో కంటతడి కూడా పెట్టారు. కూతురు నైమిషకు కూడా తండ్రి అంటే ప్రాణం. తన తండ్రే తన హీరో అని చెబుతుంది. 

నైమిషా రెడ్డి ఇంజనీరింగ్ చదువుకుంది. 2015లో వివాహం అయ్యింది. భర్త సత్యనారాయణరెడ్డి. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. వీరికి ఇటీవలే ఓ బాబు పుట్టాడు. ఇక రేవంత్ రెడ్డి వియ్యంకుడు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత వెంకట రెడ్డి.

Latest Videos

click me!