Railway: జీడిపప్పు వ్యాపారి చేసిన ప‌నికి దిగొచ్చిన ఇండియ‌న్ రైల్వే.. రూ.35,000 నష్టపరిహారం

Published : Jul 28, 2026, 04:56 PM IST

Railway: రైలు మార్గాన్ని మార్చిన విషయాన్ని ముందుగానే తెలియజేయకపోవడంతో ఒక ప్రయాణికుడు వ్యాపార సమావేశంతో పాటు విమాన ప్రయాణాన్ని కూడా కోల్పోయిన ఘటనలో రైల్వేకు వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది.

PREV
15
బిజినెస్ మీటింగ్ కోసం ఢిల్లీ ప్రయాణం..

హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో జరగనున్న వ్యాపార సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయాణం ప్లాన్ చేశారు. ఇందుకోసం చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రీమియం తత్కాల్ టికెట్‌ను రూ.1,428 చెల్లించి బుక్ చేసుకున్నారు. అయితే సెప్టెంబర్ 28న చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత రైలు సాధారణ మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడుస్తోందని తెలుసుకున్నారు.

25
ముందస్తు సమాచారం లేకపోవడంతో భారీ నష్టం

రైలు మార్గం మార్చిన విషయాన్ని రైల్వే అధికారులు ముందుగానే తెలియజేయలేదని ప్రయాణికుడు కమిషన్‌ను ఆశ్రయించారు. ఎలాంటి ఎస్‌ఎంఎస్, ఫోన్ కాల్ లేదా ఇతర సమాచారం అందకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా లేకపోయిందని వివరించారు. మార్గం మారడంతో రైలు సుమారు 16 గంటలు ఆలస్యంగా న్యూఢిల్లీ చేరుకుంది. దీంతో కీలకమైన వ్యాపార సమావేశాన్ని కోల్పోవడమే కాకుండా, తిరుగు ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకున్న విమానాన్ని కూడా అందుకోలేకపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

35
రైల్వే ఇచ్చిన వివరణ ఇదే

ఈ కేసు విచారణలో దక్షిణ రైల్వే తన వాదనను వినిపించింది. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా రైలు మార్గాన్ని మార్చాల్సి వచ్చిందని తెలిపింది. అయితే మార్గం మారిన సమాచారాన్ని విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగ్‌పూర్ వంటి మధ్యలో ఎక్కే ప్రయాణికులకు మాత్రమే సందేశాల ద్వారా పంపినట్లు అంగీకరించింది. చెన్నై నుంచి ప్రయాణం ప్రారంభించిన ప్రయాణికులకు మాత్రం అలాంటి సమాచారం అందించలేదని వెల్లడించింది.

45
సేవల్లో లోపం ఉందని కమిషన్ వ్యాఖ్య

రైల్వే వాదనను పరిశీలించిన వినియోగదారుల కమిషన్, ప్రయాణికులకు సమయానికి సమాచారం అందించకపోవడం స్పష్టమైన సేవల లోపమని పేర్కొంది. ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే బాధితుడు ఇతర ప్రయాణ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది. వ్యాపార నష్టాలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించనప్పటికీ, మానసిక వేదన, ప్రయాణ అసౌకర్యం, విమాన టికెట్ కోల్పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.

55
రూ.35 వేల పరిహారం చెల్లించాలని తుది ఆదేశం

కమిషన్ తీర్పు ప్రకారం, బాధిత ప్రయాణికుడికి మానసిక వేదనకు రూ.25,000, కేసు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని దక్షిణ రైల్వేను ఆదేశించింది. మొత్తంగా రూ.35,000 నష్టపరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రయాణికులకు సంబంధించిన కీలక సమాచారం సమయానికి అందించడం రైల్వే సంస్థల బాధ్యత అనే విషయాన్ని వినియోగదారుల కమిషన్ మరోసారి స్పష్టంచేసింది.

Read more Photos on
click me!

Recommended Stories