Hyderabad Rains : స్వయంగా రంగంలోకి దిగిన మేయర్... మోకాల్లోతు వరదనీటిలో నడుస్తూ

First Published | Sep 5, 2023, 12:55 PM IST

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జోరు వానలో, మోకాల్లోతు నీటిలో నడుచుకుంటూ బల్కంపేటలో పర్యటించారు.

Heavy rains in Hyderabad

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. గత రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తూ... ప్రాజెక్టులు, చెరువులు నిండిపోతూ ప్రమాదకరంగా మారాయి. ఇక రాజధాని హైదరాబాద్ లో రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి వుండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్వయంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 
 

Heavy rains in Hyderabad

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వయంగా బల్కంపేట ప్రాంతంలో పర్యటించారు. లోతట్టే ప్రాంతాల్లో నిలిచిన మోకాల్లోతు వర్షపునీటిలో నడుచుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకుని అధికారులు తగు సూచనలు చేసారు మేయర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని అధికారులకు సూచించారు. 


Heavy rains in Hyderabad

మేయర్ విజయలక్ష్మి ఆదేశాలతో జిహెచ్ఎంసి సిబ్బంది రోడ్లపై నిలిచిన వరదనీటిని తొలగించేందుకు ప్రయాణిస్తున్నారు. అలాగే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీన్ని పరిశీలించిన మేయర్ అక్కడ కూడా నీటిని తొలగించి రాకపోకలను పునరుద్దరించాలని ఆదేశించారు. 

Heavy rains in Hyderabad

ఇదిలావుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా మియాపూర్ ప్రాంతంలో  14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక కూకట్ పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
 

Heavy rains in Hyderabad

భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, బస్తీలను వరదనీరు చుట్టుముట్టింది. పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ సెల్లార్లు, ఇళ్లలోని వర్షపునీరు చేరింది. మూసీలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హస్సేన్ సాగర్ లోకి కూడా భారీ వరద వచ్చి చేరుతోంది. 
 

Heavy rains in Hyderabad

లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లపై గుంతల్లో వరదనీరు నిలవడంతో వాహనాలు మెల్లగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. 
 

heavy rains

భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రజలకు ఎప్పటికప్పు వాతావరణ సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు ఎక్కువైతే మునకకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాని జిహెచ్ఎంసి కమీషనర్ అధికారులను సూచించారు.

Latest Videos

click me!