Jobs : ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి జాక్‌పాట్.. రాతపరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం, అదీ హైదరాబాద్ లో

Published : Sep 20, 2025, 12:12 PM IST

Jobs : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఓ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇలా తెలుగు యువతకు సొంత రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం వచ్చింది. 

PREV
17
హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Jobs : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం… అదీ హైదరాబాద్ లో… తెలుగు యువతకు ఇంతకంటే అద్భుత అవకాశం ఇంకేముంటుంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ECIL (ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇడియా) అద్భుతమైన అవకాశం ఇస్తోంది. భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం… అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి. 

27
ECIL లో టెక్నికల్ జాబ్స్

భారతదేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ECIL ఒకటి. ఇది న్యూక్లియర్, డిఫెన్స్, ఎయిరోస్పేస్, ఐటీ,టెలికాం, నెట్ వర్క్ &హోంల్యాండ్ సెక్యూరిటీ, ఈ-గవర్నెర్స్ వంటి రంగాల్లో సేవలందిస్తుంది. ఈ సంస్థ సాలిడ్ స్టేట్ టెలివిజన్, డిజిటల్ కంప్యూటర్, కాక్ పీట్ వాయిస్ రికార్డర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM), ప్రోగ్రామెబుల్ లాజిక్ కంట్రోలర్స్, ఎర్త్ స్టేషన్ ఇండ్ డీప్ స్పేస్ నెట్ వర్క్ వంటివాటిపై పనిచేస్తుంది. దేశంలోని వివిధ ఆర్&డి ల్యాబోరేటరీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తో కలిసి పనిచేస్తుంది.

అయితే తాజాగా హైదరాబాద్ లోని ECIL సంస్థ టెక్నికల్ ఆఫీసర్ – C పోస్టుల భర్తీకి సిద్దమయ్యింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది గొప్ప అవకాశం… మరీముఖ్యంగా తెలుగు యువతకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. మొత్తం 160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

37
ECIL ఉద్యోగాల వివరాలు

ECIL తాజా నోటిఫికేషన్ కింద టెక్నికల్ ఆఫీసర్ – C పోస్టుకు మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. 

రిజర్వేషన్ల వారిగా పోస్టులు : 

అన్ రిజర్వుడ్ 65

ఈడబ్ల్యుఎస్ 16

ఓబిసి 43

ఎస్సి 24

ఎస్టి 12

47
ECIL పోస్టులకు విద్యార్హతలు, వయోపరిమితి

ఈ ఈసిఐఎల్ టెక్నికల్ పోస్టులకు B.E/B.Tech లో (ECE/ETC/E&I/Electronics/EEE/Electrical/CSE/IT/Mechanical) కనీసం 60 శాతం మార్కులతో పూర్తిచేసి వుండాలి. 

వయోపరిమితి : 

వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

57
ఈసిఐఎల్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి రుసుము లేదు. సెప్టెంబర్ 16 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది… వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 22 చివరితేదీ. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

67
ECIL ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు. 

షార్ట్ లిస్టింగ్

పర్సనల్ ఇంటర్వ్యూ

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ ఎగ్జామినేషన్

ఈ నాలుగు దశల్లో ఎంపిక చేపడతారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.

77
ECIL ఉద్యోగాలకు సాలరీ

ఈ ECIL ఉద్యోగాలకే ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు ₹25,000 జీతం ఇస్తారు. తర్వాత సంవత్సరాల్లో జీతం పెరిగి, ₹31,000 అవుతుంది.

గమనిక :  ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో నియమిస్తున్నారు. మొదట కేవలం 9 నెలల కాలానికే ఉద్యోగులను నియమించుకుంటున్నారు. అయితే సంస్థ అవసరం, ఉద్యోగి పనితీరును బట్టి 4 ఏళ్లకు పొడిగించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories