Hyderabad: గుండె కవాటలను మార్చాలంటే ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అవసరం లేకుండా గుండె కవాటాన్ని మార్చే ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) విధానాన్ని హైదరాబాద్‌కు చెందిన వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. `
మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్ డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతీని తెరిచి గుండె కవాటాన్ని మారుస్తారని చెప్పారు. అయితే TAVI విధానంలో అలాంటి అవసరం ఉండదన్నారు. కాలి రక్తనాళం ద్వారా సన్నని క్యాథెటర్‌ను ప్రవేశపెట్టి, దాని సహాయంతో కొత్త అయోర్టిక్ వాల్వ్‌ను గుండెలో అమర్చుతారని వివరించారు. ఈ విధానం వల్ల శస్త్రచికిత్స లేకుండానే చికిత్స పూర్తవుతుందని తెలిపారు.
24
రోగులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు
TAVI చికిత్సతో రోగులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇందులో ప్రధానంగా ఛాతీని తెరవాల్సిన అవసరం ఉండదు. నొప్పి, రక్తస్రావం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉంటే సరిపోతుంది. సాధారణ జీవనానికి త్వరగా తిరిగి చేరుకునే అవకాశం ఉంటుంది. వృద్ధులు, అధిక ప్రమాదం ఉన్న రోగులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. అయోర్టిక్ వాల్వ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని, లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించడం అవసరం అని డా. ప్రమోద్ కుమార్ సూచించారు.
సికింద్రాబాద్ మెడికవర్‌లో ఇప్పటికే 6 విజయవంతమైన TAVI చికిత్సలు
మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్ మాట్లాడుతూ, వృద్ధాప్యం, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోలేని వారికి TAVI ఉత్తమ ప్రత్యామ్నాయమని చెప్పారు. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు ఆరు TAVI ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
34
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించిన వైద్యులు
గుండె కవాట సమస్యలతో బాధపడే రోగుల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ తల తిరగడం, స్పృహ కోల్పోవడం, కొద్దిదూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే సరైన చికిత్సతో ప్రాణాపాయాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి గుండె చికిత్సలు
మెడికవర్ హాస్పిటల్స్ హెచ్‌ఓడీ & కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డా. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, TAVI వంటి క్లిష్టమైన చికిత్సల్లో కార్డియాక్ క్రిటికల్ కేర్ బృందం పాత్ర కీలకమని చెప్పారు. చికిత్సకు ముందు, చికిత్స సమయంలో, అనంతరం రోగిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌లు, ఆధునిక ఇమేజింగ్ టెక్నాలజీ, అనుభవజ్ఞులైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులతో కూడిన ప్రత్యేక హార్ట్ టీమ్ ద్వారా ప్రపంచ స్థాయి గుండె చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.