బాటిల్ డస్ట్ బిన్ : నెక్లెస్ రోడ్ లో స్పెషల్ అట్రాక్షన్.. పారిశుధ్య సమస్యకు చెక్..

First Published Jul 3, 2021, 3:43 PM IST

జీహెచ్‌ఎంసీ అధికారులు వాటర్‌ బాటిల్‌ ఆకారంలో ఐరన్ తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఈ వినూత్న బాటిల్ డస్ట్ బిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నెక్లెస్ రోడ్ లో ఓ వినూత్న ఆలోచన అందర్నీ ఆకట్టుకుంటోంది. వేలాది మంది నగరవాసులు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ మార్గం.
undefined
నిత్యం వచ్చే పర్యాటకులు తాగిన వాటర్ బాటిల్స్ ను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో పూర్తిగా చెత్త పేరుకుపోతోంది. దీనికి చెక్ పెట్టడానికి జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది. పారిశుధ్య సమస్యకు చెక్ పెట్టింది.
undefined
ఈ విషయం మీద మంత్రి కేటీఆర్ సైతం స్పందించి, జనాల్లో చైతన్యం తేవాలని ఆదేశించారు. దీంతో ఖాళీ బాటిళ్లను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు వాటర్‌ బాటిల్‌ ఆకారంలో ఐరన్ తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఈ వినూత్న బాటిల్ డస్ట్ బిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
undefined
click me!