తెలుగోళ్లు ఇక గోవాకు వెళ్ళాల్సిన పనిలేదు... సముద్రమే హైదరాబాద్ కు వచ్చేస్తోంది గురూ..!

Published : Aug 29, 2025, 03:03 PM IST

హైదరాబాద్ ప్రజలకు సముద్ర తీరం, బీచ్ అనుభూతిని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసం గోవానే తలదన్నేలా ఓ బృహత్తర ప్రాజెక్టును సిద్దంచేసింది రేవంత్ సర్కార్. అసలు ఏమిటీ ప్రాజెక్ట్? ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఐటీ సిటి కాస్త బీచ్ సిటీ అవుతుందా..

Hyderabad : ఓ తెలుగు సినిమాలో 'హైదరాబాద్ కు బీచ్ తీసుకువస్తా' అని రాజకీయ నాయకుడు చెబుతాడు... ఇలా అమలుకాని హామీలను నాయకులు ఇస్తుంటారనేలా వ్యంగ్యంగా ఆ డైలాగ్ ను పెట్టారు. కానీ ఇప్పుడు ఆ డైలాగ్ నిజం కాబోతోంది... తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు బీచ్ తీసుకువస్తామంటోంది. నగర ప్రజలకు వినోదాన్ని, ఆహ్లాదకర బీచ్ వాతావరణాన్ని అందించేందుకు రేవంత్ సర్కార్ ఓ మెగా ప్రాజెక్ట్ కు సిద్దమయ్యింది... ఏకంగా సముద్రాన్ని, తీరప్రాంత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్లాన్ రెడీ చేసింది. 

25
హైదరాబాదీలు ఇక ఎంజాయ్ చేయవచ్చు

హైదరాబాద్ లో అన్నీ ఉన్నాయి... ప్రకృతి ప్రసాదించిన కొండలు, అడవులు, చెరువులు, వాగులువంకలు... మనిషి ఏర్పాటుచేసుకున్న పార్కులు, జలాశయాలు, సినిమా థియేటర్లు, థీమ్ పార్కులు... ఇలా ఆహ్లాదం, ఎంటర్టైన్మెంట్ కోసం అన్నీ ఉన్నాయి. కానీ నగరవాసులు ఊ అంటే గోవా, విశాఖపట్నం, సూర్యలంక వంటి ప్రాంతాలకు వెళుతుంటారు.. ఎందుకంటే అక్కడ బీచ్ ఉందికాబట్టి. దీన్నిబట్టి తెలంగాణ ప్రజలు మరీముఖ్యంగా హైదరాబాదీలు సముద్ర తీర అందాలను ఇష్టపడుతున్నారని అర్థమవుతోంది... ఇది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది. అందుకే నగర శివారులో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు సిద్దమయ్యింది.

35
హైదరాబాద్ శివారులో ఆర్టిఫిషియల్ బీచ్

హైదరాబాద్ నగర శివారులో భారీ సముద్రం, ఇసుక తిన్నెలతో కూడిన బీచ్ వాతావరణాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ ప్రాంతాన్ని ఎంపికచేసింది. ఇప్పటికే ఇక్కడ అనేక పార్కులను ఏర్పాటుచేసి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా 35 ఎకరాల్లో ఓ సముద్రాన్నే సృష్టించి బీచ్ వాతావరణాన్ని కల్పించనుంది. ఇలా ఐటీ సిటీ కాస్త త్వరలోనే బీచ్ సిటీగా మారనుందన్నమాట.

తెలుగు ప్రజలే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు ఆకర్షించేందుకు ఈ బీచ్ ప్రాజెక్టును చేపడుతోంది తెలంగాణ సర్కార్. పర్యాటక శాఖతో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ వంటివి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నాయి. మొత్తంగా ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు వెచ్చించేందుకు సిద్దమైనట్లు.. ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) మోడల్లో దీన్ని చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

45
ఇక గోవాకు వెళ్లాల్సిన అవసరం ఉండదా?

బీచ్ అనగానే భారతీయులకు మరీముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ముందుగా గుర్తుకువచ్చేది గోవా. ఇక్కడ తీరప్రాంత అందాలతో పాటు వాటర్ గేమ్స్, ఆ ఆతిథ్యం, ఆ కల్చర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, సూర్యలంక వంటి బీచ్ లు ఉన్నా ఏపీ ప్రజలు కూడా గోవాకు వెళ్లేందుకే ఇష్టపడతారు. ఇక హైదరాబాద్ వాళ్లకు అవకాశం లేదుకాబట్టి ఛలో గోవా అంటుంటారు.

అయితే తెలుగు ప్రజల కోసం హైదరాబాద్ కే సముద్ర తీరాన్ని తీసుకువస్తామంటోంది ప్రభుత్వం. కేవలం ఆర్టిఫిషియల్ జలాశయం, ఇసుక తిన్నెలతో బీచ్ వాతావరణాన్ని కల్పించడమేకాదు... ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకెన్నో సదుపాయాలు కల్పిస్తామంటోంది. వాటర్ గేమ్స్ నుండి స్టార్ హోటళ్లు, ప్లోటింగ్ విల్లాలు, ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ షాపింగ్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, ఓపెన్ థియేటర్స్.. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ఆటలస్థలాలు వంటివి ఏర్పాటుచేయనున్నారు.

ఇలా బీచ్ అన్నా, హాలిడే ట్రిప్ అన్నా ఇప్పుడు గోవా పేరు ఎలా గుర్తుకువస్తుందో భవిష్యత్ లో హైదరాబాద్ పేరు అలా గుర్తువచ్చేలా తీర్చిదిద్దనున్నారు. స్నేహితులతో కలిసి బ్యాచిలర్ ట్రిప్ అయినా... భార్యాపిల్లలతో కలిపి ఫ్యామిలీ ట్రిప్ అయినా ఛలో హైదరాబాద్ అనేలా ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

55
హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుపై పర్యాటక శాఖ కామెంట్స్

హైదరాబాద్ శివారులో కృత్రిమ సముద్రం, బీచ్ ఏర్పాటు ప్రాజెక్టుపై తెలంగాణ పర్యాటక కార్పోరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయని... ఇప్పటికే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కూడా సిద్దమైందని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ లో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని... ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ అందుబాటులోకి వస్తే తెలంగాణకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని... తద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని పటేల్ రమేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Read more Photos on
click me!

Recommended Stories