ఓయూలోని పురాతన బావులకు పునర్జీవం.. సోమవారం పునరుద్ధరణ పనులకు శ్రీకారం

First Published | Apr 3, 2023, 8:47 PM IST

ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలోని చారిత్రక స్టెప్ వెల్స్‌ పునరుద్ధరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఓయూ విద్యార్థులు, హెచ్ఎండీఏ, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇందులో పాలుపంచుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధ్యయనం చేసి ఈ పనులు ప్రారంభించారు.
 

step well restorations in Osmania University

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పురాతన మెట్ల బావుల (స్టెప్ వెల్స్) పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ పనులకు శ్రీకారం చుట్టాయి. 
 

step well restorations in Osmania University

200 ఏళ్ల క్రితం నాటి చారిత్రాత్మక బావులకు పూర్వ వైభవం తెచ్చేలా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.


step well restorations in Osmania University

ఈ పునరుద్ధరణ పనులు సుమారు వంద మంది శ్రమదానంతో ప్రారంభం అయ్యాయి.                                                                       

గత రెండు మూడు నెలలుగా ఓయూలోని చారిత్రాత్మక బావులపై హెచ్ఎండీఏ యంత్రాంగం అధ్యనం చేసింది. 

step well restorations in Osmania University

ఓయూ వీసీ రవీందర్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పనా రమేశ్, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు డాక్టర్ బీ ప్రభాకర్, ఎస్ కే మీరా, ఇంజినీరింగ్ అధికారులు పలుమార్టు సమావేశమై పునరుద్ధరణకు కార్యచరణ రూపొందించారు.

step well restorations in Osmania University

హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పురాతన బావుల పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు.

step well restorations in Osmania University

ఈ పునరుద్ధరణ పనుల్లో ఓయూ విద్యార్థులు, అధికారులు, వాలంటీర్లు దాదాపు 100 మంది పాల్గొన్నారు. రైన్ వాటర్ ప్రాజెక్ట్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320 (బీ), పింక్ సర్కిల్, గ్రీన్ టీమ్ (వనపర్తి) సంస్థల వాలంటీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ స్టూడెంట్లు, సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్లు, ఆర్కియాలజీ స్టూడెంట్లు, హిస్టరీ స్టూడెంట్లు ఈ పనుల్లో భాగస్వాములయ్యారు.

Latest Videos

click me!