మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ సాగుతుందని వరంగల్ కేఎంసీలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఉదంతం ద్వారా బయటకు వచ్చింది. సీనియర్ సైఫ్ మెడికో ప్రీతిని వేధింపులకు గురి చేయడం ఒక రకంగా ర్యాగింగ్ కిందకే వస్తుందని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.