తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. కొత్త ఐటీ మినిస్టర్ ఆయనే..

First Published | Dec 9, 2023, 11:57 AM IST

telangana new ministers portfolio : తెలంగాణ నూతన అసెంబ్లీ మొదటి సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు, తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. 
 

అక్కడ ముందుగా లోక్ సభకు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. దానిని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. అనంతరం ఆయనకు సభ్యులు వీడ్కోలు పలికారు. తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మరో మఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీతో, అలాగే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం అయ్యారు. 

వారితో సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం ఈ శాఖల కేటాయింపు అంశం కొలిక్కి వచ్చింది. తరువాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా మంత్రిత్వ శాఖల కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే హోం మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ లకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించనున్నారు. 
 

ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే ? 

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటక శాఖ   

భట్టి విక్రమార్క - ఆర్ధిక, ఇంధన శాఖ

Latest Videos


తుమ్మల నాగేశ్వర్ రావు- వ్యవసాయ, చేనేత శాఖ 

ఉత్తమ్ కుమార్- పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ

పొంగులేటి శ్రీనివాస్ - సమాచార శాఖ

శ్రీధర్ బాబు- ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు

దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ 

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి -  రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 

దనసరి అనసుయ (సీతక్క) - పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ

పొన్నం ప్రభాకర్ - రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ 

కొండా సురేఖ - అటవీ, దేవాదాయ శాఖ

click me!