ఇదిలా ఉండగా.. గతంలో ఈటల రాజేందర్‌పైనా బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పురుడు పోసుకుందని…ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చాడని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన లాంటి వాళ్లను కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను చేశాడని చెప్పారు. మామూలు ఈటెల రాజేందర్ ను తీసుకు వెళ్ళి ఇంట్లో పెద్ద కొడుకు లాగా కేసీఆర్ పెంచుకున్నాడని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా ప్రత్యర్ధికి పని చేసిన వ్యక్తి ఈటెల అని బాల్కసుమన్ ఆరోపించారు