అప్పుడు కాంగ్రెస్ బొక్కబోర్లా: పవన్ తో పొత్తుకు బిజెపి నిరాకరణ వెనక...

First Published Nov 19, 2020, 2:09 PM IST

తెలంగాణ బిజెపి జనసేనతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుని 

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వస్తున్నారంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బిజెపికి, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, వాటిపై తెంలగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నీళ్లు చల్లారు.
undefined
వాస్తవానికి, జనసేనతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదని బండి సంజయ్ ఇది వరకే స్పష్టం చేశారు. అయితే, జనసేన తాజా ప్రకటనతో పొత్తుకు ప్రాతిపదిక ఏర్పడుతుందని భావించారు. దాంతో దానిపై బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు జనసేనతో పొత్తు ఉండదని గురువారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో కంగు తినడం జనసేన వంతు అయింది.
undefined
తెలంగాణ బిజెపి జనసేనతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుని బొక్క బోర్లా పడింది.
undefined
శాసనసభ ఎన్నికల్లో తొలుత కాంగ్రెసుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు కనిపించింది. అయితే, నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించగానే సీని రివర్స్ అయింది.
undefined
కాంగ్రెసు టీడీపీతో పొత్తు పెట్టుకోగానే శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తన గొంతు పెంచింది. కాంగ్రెసు గెలిస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తారని, మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తనం వస్తుందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం సాగించారు. తెలంగాణ వ్యతిరేకంగా ప్రజల్లో బలమైన ముద్ర వేయించుకున్న చంద్రబాబు కారణంగా శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.
undefined
ఇప్పుడు జనసేనతో తాము పొత్తు పెట్టుకుంటే గతంలో కాంగ్రెసు ఎదుర్కున్న అనుభవాన్నే తాము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం తెలంగాణ బిజెపిలో ఉండి ఉంటుంది. పవన్ కల్యాణ్ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా తన వాణిని వినిపించారు. తెలంగాణ విడిపోతుందని తెలిసి మనోవేదనకు గురయ్యానని, తాను కొద్ది రోజుల పాటు భోజనం కూడా చేయలేదని పవన్ కల్యాణ్ అప్పట్లో అన్నారు.
undefined
పవన్ కల్యాణ్ తో బిజెపి పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే అవకాశం ఉంది. బిజెపి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించింది. దాంతో పవన్ కల్యాణ్ తో జత కడితే టీఆర్ఎస్ నుంచి ఆ ప్రమాదం ఉంటుందని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు జాతీయ స్థాయి బిజెపి నేతలతో, కేంద్రం పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. దాని వల్ల, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పవన్ కల్యాణ్ ఆధిపత్యం ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగించడానికి టీఆర్ఎస్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
undefined
పైగా, దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ మీద గెలిచిన జోష్ కూడా బిజెపిలో ఉంది. తెలంగాణలో కాంగ్రెసును మూడో స్థానానికి నెట్టి టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం వచ్చినట్లు బిజెపి భావిస్తోంది. పవన్ కల్యాణ్ తో పొత్తు వల్ల ఆ అవకాశాన్ని జారవిడుచుకునే ప్రమాదం కూడా ఉందని బిజెపి తెలంగాణ నాయకులు భావిస్తూ ఉండవచ్చు. ఈ రీత్యా జనసేనతో పొత్తుకు బిజెపి సిద్ధంగా లేదని అంటున్నారు.
undefined
click me!