అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కన్నెర్ర.. నిరాటంకంగా కొనసాగుతోన్న చర్యలు

First Published Jan 22, 2022, 9:02 PM IST

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అధారిటీ (హెచ్ఎండిఎ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తింపు వాటి కూల్చివేత పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

illegal constructions

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అధారిటీ (హెచ్ఎండిఎ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తింపు వాటి కూల్చివేత పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

illegal constructions

శనివారం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో హెచ్ఎండీఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అక్రమ భవనాల కూల్చివేత కార్యక్రమాలను నిర్వహించాయి.
 

illegal constructions

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు (3) అక్రమ నిర్మాణాలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు (4) అక్రమ నిర్మాణాలు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో రెండు (2) అక్రమ నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో పదమూడు (13) అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఎ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్  కూల్చివేత చర్యలు నిర్వహించాయి.
 

illegal constructions

గత సోమవారం నుంచి అక్రమ నిర్మాణాలపై దాడుల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వారం రోజుల్లో 82 అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వాటిలో 66 ఆక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు. మరో పదహారు(16) అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు.

illegal constructions

శనివారం హెచ్ఎండిఏ, టాస్క్ ఫోర్స్ యంత్రాంగం సీజ్ చేసిన వాటిల్లో ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక రెడీ మిక్స్ సిమెంట్ ప్లాంట్,  ఒక క్రషర్ ప్లాంట్ ఉన్నాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉన్నది.

click me!