సీఎం కేసీఆర్ సమక్షంలో... దేశాన్నేలిన తెలంగాణ బిడ్డ పివికి అసెంబ్లీ అందించిన గౌరవం (ఫోటోలు)

First Published Oct 8, 2021, 4:56 PM IST

దేశ ప్రధానిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం సాదరంగా గౌరవించింది. 

హైదరాబాద్: భారత దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు తెలంగాణ అసెంబ్లీ సాదరంగా గౌరవించింది. దివంగత ప్రధాని పివి నిలువెత్తు చిత్రపటాన్ని శాసనసభ భవనంలో ఎమ్మెల్యేల లాంజ్ లో ఏర్పాటు చేసారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు,ఎంపీ కే కేశవరావు గారు, మంత్రులు,  శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లెజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహాచార్యులు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన దివంగత ప్రధాని పివిని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఎన్నోసార్లు గౌరవించింది. ఆ గౌరవంతోనే ఆయన కూతురు సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ పట్టభద్రుల స్థానం నుండి టీఆర్ఎస్ తరపున నిలిపి గెలిపించుకున్నారు. 

ఇక క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు అందుకున్న పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో గట్టేకించారు. ఇలా ఆయన సమర్ధవంతమైన పాలనను గుర్తించాలని... పివికి భారత రత్న ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం.

దివంగత పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు కూడా ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా ఏడాదిపాటూ ఈ ఉత్సవాల్ని నిర్వహించడానికి సిద్దమైంది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా వేసి సీనియర్ నాయకులు కే కేశవరావు అధ్యక్షుడిగా నియమించింది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి.

click me!