Bathukamma Celebrations : తెలుగు యూనివర్సిటీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి సై..

First Published | Oct 8, 2021, 1:19 PM IST

బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. గవర్నర్ Tamilisai Soundararajan  ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు.

Bathukamma Celebrations

తెలుగు విశ్వ విద్యాలయంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారామె. 

Bathukamma Celebrations

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే,  తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైన పండుగ అని, telangana jagruthiతో పాటు, అనేక సంస్థలు batukamma festivalకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారన్నారు.

‘పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుంది. తెలుగు మరింత పరిపుష్టం అయ్యే అవకాశం ఉంది.  దీని మీద ఆలోచించాల్సిందిగా వైస్ ఛాన్సిలర్ గారిని కోరుతున్నాను’ అన్నారు.

batukamma

బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. గవర్నర్ Tamilisai Soundararajan  ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు.

వందల సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను కాపాడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 

Latest Videos

click me!