సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

First Published | Sep 1, 2023, 2:48 PM IST

ఇడుపులపాయ నుండి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీనానికి సంబంధించి  వైఎస్ షర్మిల ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. 

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

కాంగ్రెస్‌లో  వైఎస్ఆర్‌టీపీ  విలీనానానికి సంబంధించి ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల  రెండు  రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం చేసే విషయమై  ఈ ఏడాది ఆగస్టు  31న కాంగ్రెస్ పార్టీ  అగ్రనేతలు  సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో  వైఎస్ షర్మిల చర్చించారు.తమ మధ్య  నిర్మాణాత్మకంగా  చర్చలు జరిగాయని వైఎస్ షర్మిల  ప్రకటించారు

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

తెలంగాణలో కేసీఆర్ కు కౌంట్ డౌన్  ప్రారంభమైందని  ప్రకటించారు. సోనియాగాంధీతో జరిగిన చర్చల వివరాలను మాత్రం ఆమె బయట పెట్టలేదు.  నిన్న మధ్యాహ్నమే  ఆమె  హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు.  ఇవాళ  మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయ బయలుదేరి వెళ్తారు.  మాజీ సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.  అక్కడి నుండి  హైద్రాబాద్ వచ్చిన తర్వాత   వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. 

Latest Videos


సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?


గత కొంతకాలంగా  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  వైఎస్ షర్మిల  కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ  నాయకత్వంతో  చర్చలకు  డీకే శివకుమార్ చొరవ చూపారు. డీకే శివకుమార్ సూచన మేరకు  వైఎస్ షర్మిల నిన్న  సోనియాతో భేటీ అయ్యారు.  

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

వైఎస్ షర్మిల సేవలను తెలంగాణలో  ఉపయోగించుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ కు  నష్టం జరిగే అవకాశం ఉందని  తెలంగాణకు  కాంగ్రెస్ లో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో  మాత్రమే వైఎస్ షర్మిల సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరికొందరు ఈ అభిప్రాయాలను తప్పుబడుతున్నారు.  వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే తప్పేమిటని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో వైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడ షర్మిల కాంగ్రెస్ లో చేరికను వ్యతిరేకించలేదు. 

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు రెండు ఆఫ్షన్లు ఇచ్చినట్టుగా  కూడ ప్రచారం సాగుతుంది. కర్ణాటక నుండి రాజ్యసభ సీటు ఇచ్చి  రెండు రాష్ట్రాల్లో  వైఎస్ షర్మిల  సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. మరో వైపు పాలేరు నుండి కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చి వైఎస్ షర్మిలను తెలంగాణకు  పరిమితం చేయడం రెండో ఆఫ్షన్. 

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదనలు, భవిష్యత్తు కార్యాచరణపై  పార్టీ  నేతలతో చర్చించిన మీదట  వైఎస్ షర్మిల   రెండు రోజుల్లో  భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం లేకపోలేదు.

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

వైఎస్ షర్మిలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం  ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగుతుంది.  బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కుండా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును  కాంగ్రెస్ లో చేరాలని  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు  ఆహ్వానం పలికారు.  షర్మిలకు చెక్ పెట్టేందుకే  తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేరాలని  ఆహ్వానం పలికినట్టుగా  ప్రచారం కూడ లేకపోలేదు. షర్మిల  ఢిల్లీలో  సోనియాను కలిసిన రోజునే  తుమ్మలను  రేవంత్ రెడ్డి బృందం కలిసింది. కాంగ్రెస్ లో చేరాలని  తుమ్మల నాగేశ్వరరావును  కాంగ్రెస్ నేతలు మీడియా వేదికగా ఆహ్వానాలు పలికారు.ఈ క్రమంలోనే  రేవంత్ రెడ్డి  స్వయంగా కలిసి తుమ్మల నాగేశ్వరరావును  పార్టీలో చేరాలని కోరారు.

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?


పాలేరు నుండే పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకుంటున్నారు.  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఇప్పటికే  పాలేరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.  పాలేరు నుండే  పోటీకి  మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతుంది. దీనికి కౌంటర్ గా తుమ్మల నాగేశ్వరరావు నుండి  రంగంలోకి దింపాలని  షర్మిలను వ్యతిరేకిస్తున్న వర్గం భావిస్తుంది. షర్మిల పాలేరు నుండి  పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటే    పాలేరును వదిలి ఖమ్మం నుండి  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేసే అవకాశం ఉంది.గత ఎన్నికల సమయంలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తును బూచిగా చూపి కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చిన విషయాన్ని  కొందరు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిలను చూపి పార్టీకి నష్టం చేసేందుకు  కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉందని  పార్టీలో ఓ వర్గం నేతలు  చెబుతున్నారు. అయితే  ఈ వాదనతో మరికొందరు నేతలు విబేధిస్తున్నారు.

సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?

జమిలి ఎన్నికలు జరగకపోతే  తొలుత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ షర్మిల సేవలను ఉపయోగించుకొనే అవకాశం ఉంది.  ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో  షర్మిల కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు  పనిచేసే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. ఈ విషయాలపై  రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే కేసీఆర్ ఏ రకంగా  దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటారనే విషయ

click me!