చేతక్ హెలికాఫ్టర్లకు 60 ఏళ్లు.. డైమండ్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైన ఎయిర్‌ఫోర్స్, హకీంపేటలో రిహార్సల్స్

Siva Kodati |  
Published : Mar 30, 2022, 10:00 PM IST

చేతక్ హెలికాఫ్టర్లు భారత సాయుధ దళాల్లోకి ప్రవేశించి 60 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డైమండ్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.  

PREV
14
చేతక్ హెలికాఫ్టర్లకు 60 ఏళ్లు.. డైమండ్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైన ఎయిర్‌ఫోర్స్, హకీంపేటలో రిహార్సల్స్
Cheetah helicopters

భారత సాయుధ దళాలలోకి చేతక్ హెలికాఫ్టర్ ప్రవేశించి 60 ఏళ్లు గడుస్తోంది. ఈ మహత్తరమైన సంఘటనను గుర్తుచేసుకోవడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అండ్ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏప్రిల్ 2న కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. 

24
Cheetah helicopters

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సమ్మేళనానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, హెలికాఫ్టర్ స్ట్రీమ్‌లోని మూడు సర్వీసులలో సేవలందించిన సీనియర్, రిటైర్డ్ అధికారులు , రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇండియన్ కోస్ట్‌ గార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారులు హాజరవుతారు. 

34
Cheetah helicopters

దేశంలో ఆరు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న చేతక్ హెలికాఫ్టర్ కార్యకలాపాలను హైలైట్ చేస్తూ .. ఈ ప్రస్థానాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే  ఉద్దేశంతోనే కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో అనుభవజ్ఞులైన అధికారులు, నిపుణులతో చర్చలు కూడా జరుగుతాయి. 

44
Cheetah helicopters

చేతక్/చీతా హెలికాప్టర్‌ల డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఈ రోజు చేతక్ హెలికాప్టర్ ద్వారా ఫ్లై పాస్ట్ రిహార్సల్ నిర్వహించారు. పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్, కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్, సూర్య కిరణ్ ఏరోబాటిక్‌లు రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. 

click me!

Recommended Stories