Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?

Published : Jul 09, 2026, 10:59 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా వర్షాలే కురవడం లేదు… ప్లాష్ ప్లడ్స్ అంటున్నారేంటి? అనేగా మీ డౌట్. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని నదుల్లోకి వరద నీరు ఏ స్థాయిలో చేరుతోంది? ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఎంతకు చేరింది? అనేది తెలుసుకోవాల్సిందే.  

PREV
14
తెలుగు రాష్ట్రాలకు పోటెత్తిన వరదనీరు

Flash Floods Alert : సాధారణంగా జూలై, ఆగస్ట్ లో భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయి... అసలు సిసలైన వర్షాకాలం ఇదే. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతాయి... ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారతాయి. కానీ ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవలేవు... అడపాదడపా మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవకున్నా కొన్ని ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది... వరద నీటితో ప్రాజెక్టులకు నిండుకుండల్లా మారుతున్నాయి. ఈ క్రమంలో నీటిని దిగువకు వదులుతున్నాయి... కాబట్టి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలకు ఆస్కారం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

24
తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం..

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టే గోదావరి నది నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి... దాదాపు 550 కిలోమీటర్ల దూరం రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో భారీ వరదనీటిని మోసుకుని తెలంగాణలోకి ప్రవేశిస్తోంది గోదావరి. ఇక్కడ వర్షాలు లేకపోయినా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ వరద పరిస్థితులను సృష్టిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది… 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా 70,140 క్యూసెక్కులు ఇన్ ప్లో వస్తుండగా... వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద కూడా గోదావరి జలకలను సంతరించుకుంది. వేసవి కాలంలో భారీగా నీటిమట్టం తగ్గగా... ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో అంతకంతకు నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 10.9 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది... స్నానఘట్టాల వద్దకు వరద నీరు చేరింది. మహారాష్ట్రలో వర్షాలు కొనసాగుతుండటంతో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయి... కాబట్టి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

34
పోలవరంకు పోటెత్తిన వరదనీరు...

మహారాష్ట్రతో పాటు ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. అందుకే గోదావరి ముందుకు సాగుతున్నకొద్దీ మరింత ఉద్రుతంగా మారుతుంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులకు వరదనీరు ఆటంకం కలిగిస్తోంది. ప్రస్తుతం పోలవరం వద్ద లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది... స్పిల్ వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరింది... అదే కాపర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 26.80 మీటర్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 48 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు.

భారీ వరదనీటిలో పోలవరం ప్రాజెక్టు పైపులు కొట్టుకుపోయాయి. అలాగే ప్రాజెక్టు పనులకోసం వేసిన మట్టిరోడ్డు కూడా కొట్టుకుపోయింది. అయితే వరద పరిస్థితిని ముందే పసిగట్టిన అధికారులు కార్మికులను అలర్ట్ చేశారు... దీంతో ప్రమాదం తప్పింది. అయితే భారీ వరదనీటితో గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.

దవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఎగువనుండి భారీగా వరద ప్రవాహం వస్తోంది... దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదలనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

44
కృష్ణా నదికి వరద..

తెలుగు రాష్ట్రల్లో ప్రవహించే మరో జీవనది కృష్ణా. ఈ నదికి కూడా వరద ప్రవాహం మెళ్ళిగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 4,750 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తోంది... దీని నీటిమట్టం 317 మీటర్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లే... అందుకే గేట్లను ఎత్తు దిగువకు నీరు వదులుతున్నారు. 

ఈ కృష్ణా నదిపై ఉన్న మరికొన్ని ప్రాజెక్టులకు కూడా వరద నీరు చేరి జలకళ సంతరించుకుంది. ఎగువన వర్షాలు కొనసాగుతుండటంతో నదీప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి... కాబట్టి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories