మురికి మూసీ ఇకపై మురిపించనుంది... సుందరీకరణతో ఇలా మారనుందట..!

First Published | Sep 25, 2023, 12:46 PM IST

హైదరాబాద్ పరిసరాలను మరింత సుందరంగా మారుస్తూ మూసీ నదిపై ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి సిద్దమయ్యింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వీటి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 

Musi Bridge

హైదరాబాద్ : పేరుకే అది నది... నిజం చెప్పాలంటే అదో మురికి కాలువ. ఇదీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నది పరిస్థితి. ఒకప్పుడు మూసీ నది మంచినీటితో కళకళలాడేదని, ఒడ్డున ఆహ్లాదకర వాతావరణం వుండేదని పెద్దలు చెబుతుంటే వుంటుంటాం. అయితే కాలక్రమేన మురికికూపంగా మారిన మూసీ నదిని తిరిగి సుందరంగా మార్చేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా మూసీ, ఈసి నదులపై అందమైన వంతెనల నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. 
 

Musi Bridge

హైదరాబాద్ నగరంలో మధ్యలోంచి ప్రవహించే మూసీ నదిపై సరికొత్త డిజైన్లతో వంతెనలు నిర్మించడానికి హెచ్ఎండిఏ (హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ) సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే మూసీపై 3, ఈసాపై 2 మొత్తంగా ఐదు బ్రిడ్జీల నిర్మాణానికి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.168 కోట్ల భారీ వ్యయంతో ఈ ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తవగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. 

Latest Videos


Musi Bridge

ఇవాళ(సోమవారం) మంత్రి కేటీఆర్ మూసీ, ఈసా నదులపై సుందరమైన బ్రిడ్జీల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 15 నెలల్లోనే ఈ ఐదు బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎండిఎం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నిర్మాణం వెనక ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సదుపాయాలు కల్పించాలనే కాదు మూసీ సుందరీకరణ కూడా జరుగుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. 

Musi Bridge

నార్సింగి నుండి గౌరెల్లి మధ్యలో 55కిలోమీటర్ల దూరంలో నాలుగు లేన్లతో ఐదు బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. ఉప్పల్ భగాయత్ లేఔట్ వద్ద సుమారు రూ.42 కోట్లతో బ్రిడ్జిని నిర్మించనున్నారు. అలాగే మరో రూ.35 కోట్లతతో ప్రతాపసింగారం-గౌరెల్లి మధ్య మరో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. మంచిరేవుల వద్ద రూ.39 కోట్లతో మరో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది.

Musi Bridge

ఇక బద్వేల్ ఐటీ పార్క్‌-1 వద్ద ఈసానదిపై రూ.32 కోట్లతో, ఐటీ పార్క్‌-2 వద్ద రూ.20 కోట్లతో మరో రెండు బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. ఇలా ఈ ఐదు బ్రిడ్జిలను నాలుగు లేన్లతో సుందరంగా నిర్మించేందుకు హెచ్ఎండీ సిద్దమయ్యింది. ఈ బ్రిడ్జిలకు సంబంధించిన డిజైన్లను కూడా అధికారులు సిద్దం చేసారు. 

click me!