బిఆర్ఎస్ కు బిగ్ షాక్... సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా నలుగురు కార్పోరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్?

First Published | Sep 25, 2023, 10:29 AM IST

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకుడు మరో నలుగురు కార్పోరేటర్లతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. 

Mynampally

హైదరాబాద్ : అధికార బిఆర్ఎస్ టికెట్ దక్కక కొందరు సిట్టింగ్ లు ఆ పార్టీని వీడారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నాయకులు కూడా ఏ పార్టీ అవకాశం ఇస్తామంటే ఆ పార్టీలో చేరారు. కానీ బిఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కినా ఆ పార్టీకి రాజీనామా చేసారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మెదక్ అసెంబ్లీ సీటును కొడుకు రోహిత్ కు ఇప్పించాలని ప్రయత్నించి భంగపడ్డారు మైనంపల్లి. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన ఆయన కొడుకు కోసం తన సీటును కూడా త్యాగం చేస్తూ ఇటీవలే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. 

congress

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దపడే మైనంపల్లి హన్మంతరావు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. తనకు మల్కాజ్ గిరి, కొడుకుకు మెదక్ సీటుపై కాంగ్రెస్ పెద్దల నుండి హామీ లభించడంతో లాంఛనంగా ఆ పార్టీలో చేరనున్నారు. కొడుకు రోహిత్ తో కలిసి కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారయినట్లు తెలుస్తోంది. 

Latest Videos


Congress

సెప్టెంబర్ 27న హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నారని అటు కాంగ్రెస్, ఇటు మైనంపల్లి వర్గాల నుండి అందుతున్న సమాచారం. కొడుకు రోహిత్ తో పాటు మరో నలుగురు బిఆర్ఎస్ కార్పోరేటర్లు కూడా హన్మంతరావుతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారట. దేశ రాజధాని డిల్లీలో ఈ చేరికల కార్యక్రమం వుంటుందని... కాంగ్రెస్ పెద్దలముందు బలప్రదర్శనకు మైనంపల్లి వర్గం సిద్దమైనట్లు తెలుస్తోంది. భారీగా నాయకులు, అభిమానులను డిల్లీకి తరలించేందుకు మైనంపల్లి హన్మంతరావు సిద్దమైనట్లు తెలుస్తోంది.
 

gandhi bhavan

అయితే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హన్మంతరవు చేరికపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇవాళ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,  టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు మైనంపల్లి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ తో మంతనాలు పూర్తయి మల్కాజ్ గిరి, మెదక్ సీట్లపై హామీ లభించిందని... అందువల్లే మైనంపల్లి ధైర్యంగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసారని రాజకీయ చర్చ జరుగుతోంది. 

MALKAJGIRI

భారీ అనుచరగనం, అభిమానులు, తనవెంటనడిచే నాయకులు, కార్యకర్తలు మైనంపల్లి వెంట నడిచేందుకు సిద్దం కావడం బిఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. మైనంపల్లి పార్టీని వీడారు కాబట్టి బిఆర్ఎస్ మరో అభ్యర్థి వేటలో పడింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో మరికొందరు నాయకుల పేర్లను బిఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందట. 

Harish Rao

తన కొడుకుకు మెదక్ టికెట్ దక్కనివ్వకుండా మంత్రి హరీష్ రావు అడ్డుపడుతున్నారంటూ  బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందు హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హరీష్ అంతు చూస్తాను... సిద్దిపేటలోనూ ఆయనను ఓడిస్తానంటూ హెచ్చరించాడు. ఇలా మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికి మల్కాజ్ గిరి టికెట్ మైనంపల్లికే దక్కింది. కానీ మెదక్ టికెట్ మాత్రం రోహిత్ కు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేటాయించారు.ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంతరావు వ్యతిరేక గళం వినిపించారు.

Mynampally

తనకు టికెట్ ఇచ్చినా కొడుకుకు టికెట్ దక్కకపోవడంతో హన్మంతరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన హన్మంతరావు పార్టీ మారడానికే సిద్దమయ్యారు. ఆయన బిజెపిలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. కానీ సస్పెన్స్ కు తెరదించుతూ హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు... త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

click me!