కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

First Published | Sep 24, 2023, 9:00 PM IST

ఉదయ్ పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి కొంపలు ముంచుతాయోననే చర్చ సాగుతుంది.  
 

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు కోరుతున్న నేతలకు  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  టిక్కెట్లు కేటాయిస్తుందా లేదా అనేది ప్రస్తుతం  ఆసక్తికర చర్చ సాగుతుంది. గతంలో రాజస్థాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ రెండు టిక్కెట్లు కోరుకొనే వారికి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. అయితే  ప్రత్యేక మినహాయింపులతో తమకు రెండు టిక్కెట్లు ఇవ్వాలని  కోరుతున్నారు కొందరు  నేతలు.

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య పద్మావతి రెడ్డికి కూడ కాంగ్రెస్ టిక్కెట్టును కోరుతున్నారు.  ఈ మేరకు వీరిద్దరూ కూడ కాంగ్రెస్ టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ఆయన భార్య పద్మావతి రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది.మరోసారి రెండు అసెంబ్లీ స్థానాలకు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతిలు  మరోసారి ధరఖాస్తు చేసుకున్నారు.

Latest Videos


కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి , ఆయన తనయుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్టును కోరారు. నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి, మిర్యాలగూడ నుండి ఆయన తనయుడు రఘువీర్ నుండి బరిలోకి దింపాలని భావించారు.  అయితే 2018 లో  నాగార్జునసాగర్ నుండి జానారెడ్డికి మాత్రమే టిక్కెట్టు దక్కింది.  మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి జానారెడ్డి తనయుడికి బదులుగా  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. ఈ స్థానం నుండి  కృష్ణయ్య  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

ఈ ఎన్నికల్లో కూడ  జానారెడ్డి ఇద్దరు కొడుకులు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ధరఖాస్తు చేస్తుకున్నారు. జానారెడ్డి పెద్ద కొడుకు  రఘువీర్ రెడ్డి  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి ధరఖాస్తు చేసుకున్నారు.  జానారెడ్డి చిన్న కొడుకు జయవీర్ రెడ్డి  మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా జానారెడ్డి మాత్రం కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్దు చేసుకోలేదు.

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారంగా  ఒక కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వాలంటే  టిక్కెట్టు కోరుకుంటున్న అభ్యర్థి  పార్టీలో కనీసం ఐదేళ్ల పాటు పనిచేయాలనే నిబంధన ఉంది.  అయితే పద్మావతి రెడ్డి పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించిందని చెబుతున్నారు.ఈ దఫా కూడ వీరిద్దరికి టిక్కెట్లు దక్కే అవకాశం ఉందనే ప్రచారం ఆ పార్టీలో సాగుతుంది.

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

 రెండు రోజుల క్రితం మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మల్కాజిగిరి  అసెంబ్లీ టిక్కెట్టు  మైనంపల్లి హన్మంతరావుకు దక్కింది. కానీ తన కొడుకు రోహిత్ కు  కూడ  మెదక్  నుండి పోటీ చేసేందుకు  మైనంపల్లి హన్మంతరావు ఆశించారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం  మెదక్ టిక్కెట్టును  మైనంపల్లి రోహిత్ కు ఇవ్వలేదు. దీంతో  మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.మల్కాజిగిరి, మెదక్ సీట్లను  మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నారు.  అయితే  ఈ రెండు సీట్లు మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కేటాయించడానికి ఉదయ్ పూర్ డిక్లరేషన్ అడ్డుపడే  అవకాశం ఉంది.  రెండు టిక్కెట్ల కోసం బీఆర్ఎస్ ను వీడి మైనంపల్లి హన్మంతరావు  కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. 

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

మరో వైపు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ఆసిపాబాద్,  ఖానాపూర్ అసెంబ్లీ టిక్కెట్లను  రేఖానాయక్ కుటుంబం కోరుతుంది.  రేఖానాయక్ ప్రస్తుతం  ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు ఆమెకు దక్కలేదు.దీంతో  రేఖా నాయక్ భర్త  శ్యాం నాయక్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
ఆసిఫాబాద్ టిక్కెట్టు కోసం  ఆయన ధరఖాస్తు చేసుకున్నారు.  ఖానాపూర్  నుండి రేఖా నాయక్  కూడ కాంగ్రెస్ టిక్కెట్టు కోసం అప్లై చేశారు. వీరిద్దరికి కూడ టిక్కెట్టు విషయమై కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే  చర్చ కూడ లేకపోలేదు

కాంగ్రెస్ నేతల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ భయం: ఆ నేతలకు లక్కు దక్కేనా?

అయితే ఇదే సమయంలో  పార్టీలో ఇటీవల చేరిన వారికి టిక్కెట్ల కేటాయింపుల విషయంలో  ఆ పార్టీ అగ్రనేతలు  సోనియా, రాహుల్ గాంధీల సిపారసులు లభిస్తే  టిక్కెట్లు దక్కే అకాశం ఉంది. అయితే   ఉదయ్ పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ లో ఎవరి కొంపలు ముంచుతాయనే చర్చ కూడ లేకపోలేదు. 

click me!