8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో లోపల 17 మంది చిక్కుకున్నారు
ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే విధుల్లో చేరారు
మరో అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్ తన సహోద్యోగులను కాపాడే ప్రయత్మం చేశారు
ఐదు నిమిషాల్లో తాను మరణిస్తున్నానని, తన వద్దకు ఎవరూ రావద్దని ఆయన మోహన్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది.
దట్టంగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలిగింది
మంటల్లో 9 మంది చిక్కుకున్నట్లు విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రమాదం జరిగిన ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, తదితరులు అక్కడికి చేరుకున్నారు
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. తొలుత నాలుగో యూనిట్ టెర్మినల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి శబ్దాలొచ్చినట్లు తెలుస్తోంది
మొత్తం ఆరు యూనిట్లలో కూడా పొగలు కమ్ముకున్నాయి. కరెంట్ ఉత్పత్రి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాదంలో మరణించిన ఏఈ సుందర్