ఏకంగా కోర్టులనే మోసం చేస్తూ...నిందితులను విడిపిస్తున్న ముఠా గుట్టురట్టు

First Published Aug 14, 2020, 2:46 PM IST

నకిలీ నివాసం, నకిలీ ఇంటి పన్ను రసీదు డాక్యుమెంట్స్‌, స్టాంప్స్‌ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.  

న్యాయస్థానాలను మోసం చేసి నిందితులను అక్రమంగా విడిపించడమే లక్ష్యంగా సాగుతున్న నకిలీ జామీన్ పత్రాల దందాను టాస్క్ ఫోర్స్ మరియు గోదావరిఖని పట్టణ పోలీసులు బట్టబయలు చేశారు. రామగుండము పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు డిసిపి పెద్దపల్లి పి.రవీందర్, డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, గోదావరిఖని ఎసిపి ఉమేందర్ సారధ్యంలోని బృందం నకిలీ నివాసం, నకిలీ ఇంటి పన్ను రసీదు డాక్యుమెంట్స్‌, స్టాంప్స్‌ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టింది.
undefined
న్యాయస్థానాలను నకిలీ జామీను పత్రాలతో నమ్మించి నిందితుల జామీను కోసం సిద్దంగా ఉన్న ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ మస్తాన్ లు తమ సిబ్బందితో కలిసి ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని విచారించగా మిగతా ముఠా సభ్యుల యొక్క వివరాలు మరియు అసలు సూత్రదారుల వివరాలు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకోదడమే కాదు నకిలీ పత్రాలను, స్టాంప్ లు, నివాస పన్ను రసీదు బుక్ లు , స్వాధీనం చేసుకున్నారు.
undefined
ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ...నకిలీ జామీన్‌దారులు(స్యురిటి) లతో కోర్టులనే మోసం చేస్తున్న ఈ దందా కొందరు న్యాయవాదుల సహకారంతో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో పంచాయితీ కార్యదర్శి జారీచేసే అసలు స్యురిటి బదులు నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 200కి పైగా కేసులలో నకిలీ పత్రాలను న్యాయవాదులకు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కొంతమంది న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
undefined
అరెస్ట్ చేసిన నిందితుల వివరములు:1. బోయిని కొమురయ్య so ఓదెలు ,53yrs,2. మల్లిపల్లి కిషన్ so చంద్రయ్య ,35yrs3. ఎండి తాజ్ so యాకుబ్ 4. పులిపాక శేఖర్ so నర్సయ్య 30yrs5. జూల శ్రీనివాస్ so రాజయ్య 34yrs 6. బత్తిని శివ కుమార్ so రాజయ్య 30yrs 7. జూల అది నారాయణ so పెద్ద రాయమల్లు 31yrs 8. నిమ్మతి మహేందర్ so లింగమూర్తి,43yrs,విఠల్ నగర్ ,గోదావరిఖని(అడ్వకేట్ మున్సి)
undefined
స్వాధీన పరుచుకున్న వాటి వివరములు:జామీన్‌దారుల(స్యురిటి) నకిలీ పత్రాలు -03జామీన్‌దారుల(స్యురిటి) నకిలీ ఇంటి పన్ను పత్రాలు-03ఇంటి పన్ను బిల్లు నకిలీ బుక్స్ -03జల్లారం గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరుతో ఉన్న రబ్బర్ స్టాంపు - 02జల్లారం గ్రామ పంచాయితీ పేరుతో ఉన్న రౌండ్ రబ్బర్ స్టాంపు – 02
undefined
click me!