ఫిబ్రవరి 14న స్కూళ్లు, కాలేజీలకు సెలవు :
ఈ ఏడాది(2025) తెలుగు రాష్ట్రల్లో విద్యాసంస్థలకు సెలవులే సెలవులు వస్తున్నాయి. న్యూ ఇయర్ ఆరంభమే సెలవుతో జరిగింది... జనవరి 1న స్కూళ్లు, కాలేజీలకు సెలవు వచ్చింది. ఇక ఈ నెలలో సంక్రాంతికి భారీగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో నేషనల్ హాలిడే వచ్చింది... కానీ ఇది సండే రావడంతో సాధారణ సెలవుతో కలిసిపోయింది.
ఇక జనవరి 28న షబ్-ఎ-మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజున ముస్లి మైనారిటీ విద్యాసంస్ధలు సెలవు పాటించాయి. అలాగే హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్ధలు సెలవు ఇచ్చాయి. ఇక ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వుండే ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవు ఇచ్చారు.
ఇలాగే ఈ నెలలో ఫిబ్రవరి 3న అంటే ఇవాళ వసంత పంచమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 14న కూడా మరో ఆప్షనల్ హాలిడే వస్తోంది. షబ్-ఎ-బరాత్ సందర్భంగా మరో ఆప్షనల్ హాలిడే వస్తోంది. ఈరోజున ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలు సెలవు పాటించనున్నాయి.