Eatala
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బిసి సీఎం నినాదం ఎత్తుకుంది. ఇఫ్పటికే బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించిన బిజెపి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ బిసి సీఎం తన భర్త ఈటల రాజేందర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఈటల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Eatala Jamuna
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఈటల జమున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన భర్త ఈటల రాజేందర్ కు మరోసారి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ఈసారి ఈటలను కేవలం ఎమ్మెల్యేగానే కాదు ముఖ్యమంత్రిగా ఈటలను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జమున అన్నారు. కష్టసుఖాల్లో అండగా వున్న తమ సారు మళ్ళీ గెలవాలే... ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి... అనేదే ప్రజల నినాదంగా వుందని ఈటల జమున అన్నారు.
BJP Eetela
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ తప్ప మరొకరు గెలిచే అవకాశమే లేదని... ఆయనంటే ఇక్కడి ప్రజలకు అంత అభిమానమని జమున పేర్కొన్నారు. ఇప్పటికే ఏడుసార్లు హుజురాబాద్ నుండి ఈటల గెలిచారు... ఇక ముుందు కూడా గెలిచేది ఆయనేనని అన్నారు. ఆయనకు హుజురాబాద్ ప్రజలంటే... ప్రజలకు ఆయనంటే ఇష్టమని ఈటల జమున తెలిపారు.
telangana bjp
హుజురాబాద్ ప్రజలు తనను గెలిపించుకుంటారనే నమ్మకంతోనే రాజేందర్ సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు సిద్దమయ్యారని జమున తెలిపారు. హుజురాబాద్, గజ్వేల్ ఈటలకు రెండు కళ్లలాంటివని జమున అన్నారు. గత హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందని ఈటల జమున తెలిపారు.
KCR Eatala
ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను దెబ్బతీసేందుకు ఆయనగురించి అంతా తెలిసిన ఈటల రాజేందర్ ను వాడుకుంటోంది బిజెపి. బిఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు వహించిన అనుభవం, సీఎం కేసీఆర్ రాజకీయాలు ఎలా వుంటాయో తెలియడమే ఇప్పుడు ఈటలకు కలిసి వచ్చింది. దీంతో ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఈటలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది బిజెపి అధిష్టానం. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించే మరో బాధ్యతను ఈటలకు అప్పగించింది.
Eatala
ఈటలను సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేయించడం... ఇదే సమయంలో బిజెపి బిసి సీఎం నినాదం అందుకోవడంతో ప్రజల్లో కొత్త ప్రచారం ప్రారంభమయ్యింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ఈటలనే ముఖ్యమంత్రి చేయనున్నారని ప్రచారం జోరందుకుంది. ఇదే విషయాన్ని హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల జమున తెలిపారు.