కరీంనగర్: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా రాత్రి నుండి భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వరదనీరు చేరింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహాయ సహకారాలు అందించారు.