బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రేపే: 105 మందితో జాబితా

First Published | Aug 20, 2023, 11:10 AM IST


బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  రేపు  తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే  అవకాశం ఉంది. అయితే  ఈ దఫా 11 మంది సిట్టింగ్ లకు  కేసీఆర్ టిక్కెట్టు నిరాకరించే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.

kcr

ఈ ఏడాది చివరలో  జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేసే అభ్యర్థుల జాబితాను  విడుదల చేసేందుకు  సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.  ఈ నెల  21న తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను  విడుదల చేసే అవకాశం ఉంది.  105 మంది  అభ్యర్థులను కేసీఆర్ విడుదల చేయనున్నారు.  మిగిలిన అభ్యర్థుల జాబితాను  ఈ నెల  25న కేసీఆర్ విడుదల చేయనున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.   ఈ నెల  21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం  రెండు గంటలలోపుగా  అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.

1983 లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా చలకుర్తి నుండి పోటీ చేసి జానారెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1985లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశించాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జానారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పాడు.టీడీపీకి రాజీనామా చేసిన జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ అసెంబ్లీలో  బీఆర్ఎస్ కు  103 మంది ఎమ్మెల్యేలున్నారు.2018లో జరిగిన  ఎన్నికల్లో  బీఆర్ఎస్ స్వంతంగా  88 ఎమ్మెల్యేలను కైవసం చేసుకుంది.  కాంగ్రెస్ , టీడీపీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ లో  చేరారు.  దీంతో ఆ పార్టీ బలం  103కు చేరుకుంది.


kcr

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని  కేసీఆర్ భావిస్తున్నారు. రేపు మంచి ముహుర్తం ఉండడంతో  అభ్యర్థుల జాబితాను  విడుదల చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

kcr

అయితే  ఈ దఫా  11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని  కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. 
ఆదిలాబాద్ లో నలుగురు, కరీంనగర్ లో ఇద్దరు, ఖమ్మంలో  ఇద్దరు, వరంగల్ లో  ఇద్దరు, జీహెచ్ఎంసీ పరిధిలో  ఒక్క  సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు  ఇవ్వవద్దని  సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతుంది. 2018లో  ఏడుగురు సిట్టింగ్ లకు  కేసీఆర్ సీట్లు నిరాకరించారు.ఈ ఏడు స్థానాల్లో  పోటీ చేసిన కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. ఈ దఫా కూడ  11 స్థానాల్లో  కొత్త వారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. 

kcr

ఇదిలా ఉంటే  రాష్ట్రంలో 10 నుండి  15 అసెంబ్లీ స్థానాల్లో  అసమ్మతి సెగ కూడ నెలకొంది. సిట్టింగ్ లకు  సీట్లు ఇవ్వవద్దని కోరుతున్నారు.అయితే  ఈ అసెంబ్లీ స్థానాల్లో  సిట్టింగ్ లను కాదని వైరి వర్గం డిమాండ్లను కేసీఆర్  పట్టించుకొంటారా అనేది  అభ్యర్థుల జాబితాతో  తేలనుంది.

తెలంగాణలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా  పావులు కదుపుతున్నారు. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను మాత్రమే ఈ దఫా అసెంబ్లీ బరిలో దింపనున్నారు.  ఈ మేరకు  పలు సర్వేలను  బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహిస్తుంది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా  బీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది.  రేపు అభ్యర్థుల జాబితాను  ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆశావాహులు  కేసీఆర్, కేటీఆర్ లను ప్రసన్నం చేసుకునేందుకు  ప్రయత్నాలు  చేస్తున్నారు.

CM KCR

టిక్కెట్లు దక్కని అభ్యర్థులకు  ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటేడ్  పదవులు ఇస్తామని కేసీఆర్  హామీ ఇస్తున్నారు.  సిట్టింగ్  ఇవ్వని అభ్యర్థులను పిలిపించి కేసీఆర్  మాట్లాడుతున్నారు. అయితే  కొందరు  సిట్టింగ్ ఎమ్మెల్యేలు  కేటీఆర్ ను కలిసి  ఈ దఫా తమకు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. 

Latest Videos

click me!