పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ నేతలు

First Published | Aug 2, 2023, 12:20 PM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని  కొల్లాపూర్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల  కోసం నేతల మధ్య  పోటీ నెలకొంది.

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్,  కొల్లాపూర్ అసెంబ్లీ  సీట్ల కోసం  కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య  పోటీ నెలకొంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని  14 అసెంబ్లీ స్థానాలున్నాయి.  కొల్లాపూర్  అసెంబ్లీ స్థానం నుండి  గతంలో  జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహించారు.  ఇవాళ జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.   ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారు.

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

2014 ఎన్నికలకు  ముందు  కాంగ్రెస్ పార్టీని వీడి  ఆయన  బీఆర్ఎస్ లో చేరారు.  2014లో  కొల్లాపూర్  నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.  2018లో  మరోసారి  ఇదే స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు.  జూపల్లి కృష్ణారావుపై వియం సాధించిన  కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో  జూపల్లి  కృష్ణారావుపై బీఆర్ఎస్ నాయకత్వం  వేటేసింది.  దీంతో ఆయన  కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos


పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

జూపల్లి కృష్ణారావు  బీఆర్ఎస్ లో చేరడంతో  టీడీపీలో  ఉన్న చింతలపల్లి జగదీశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  జగదీశ్వరరావు  కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో  జగదీశ్వరరావులో  ఆందోళన నెలకొంది.  తనకు  కొల్లాపూర్ అసెంబ్లీ సీటు దక్కదనే భయం జగదీశ్వరరావులో నెలకొంది.  జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని  జగదీశ్వరరావు పార్టీ నేతలను  కోరారు. అయినా పార్టీ నాయకత్వం  మాత్రం పట్టించుకోలేదు. దీంతో జగదీశ్వరరావు  ఓ వీడియోను విడుదల చేశారు.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తాను రాజీపడినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన  తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  తనకే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన డిమాండ్  చేశారు.
 

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్  అసెంబ్లీ స్థానంలో  కూడ ఇదే రకమైన  పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  నాగం జనార్థన్ రెడ్డి  పలు  దఫాలు టీడీపీ  అభ్యర్ధిగా, ఒక్కసారి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు.  రానున్న ఎన్నికల్లో నాగం జనార్థన్ రెడ్డి  మరోసారి  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం  చేసుకుంటున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి రాజేష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి  భావిస్తున్నారు.

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

 కాంగ్రెస్ పార్టీ  నేతలతో ఈ విషయమై  దామోదర్ రెడ్డి  చర్చించారని ప్రచారం సాగుతుంది. నాగర్ కర్నూల్  అసెంబ్లీ స్థానం నుండి  తనకే కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వాలని నాగం జనార్థన్ రెడ్డి  కోరుతున్నారు. పార్టీలో  కొత్తగా చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని నాగం జనార్ధన్ రెడ్డి  కోరుతున్నారు.   గతంలో నాగం జనార్ధన్ రెడ్డి  టీడీపీలో ఉన్న సమయంలో  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో  ఉన్నారు.గతంలో  దామోదర్ రెడ్డిపై  నాగం జనార్థన్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు. 

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

జూపల్లి కృష్ణారావు  ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి  మద్దతుగా  నిలుస్తున్నారు.  ఈ పరిణామం  నాగం జనార్థన్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. పార్టీ కోసం కష్టపడినవారికి టిక్కెట్లు ఇవ్వాలని నాగం జనార్ధన్ రెడ్డి  డిమాండ్ చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం  నాగం జనార్థన్ రెడ్డికి  రాజకీయంగా కూడ  ఇబ్బందేననే  అభిప్రాయాలను  రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులునేతలు వేస్తున్న కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు సాధించేందుకు  ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు  చెందిన  కాంగ్రెస్ నేతలు  ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

click me!