మహబూబ్ నగర్ లో కల్తీ కల్లు కలకలం.. మహిళతో సహా ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం...

Published : Apr 13, 2023, 08:05 AM IST

మహబూబ్ నగర్ లో కల్తీకల్లు తాగి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

PREV
16
మహబూబ్ నగర్ లో కల్తీ కల్లు కలకలం.. మహిళతో సహా ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం...

మహబూబ్ నగర్ : తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీకల్లు ముగ్గురి ప్రాణాలు తీసింది. గత శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి 42 మంది చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. ఈ 42 మందిలో మహబూబ్నగర్ జిల్లా కోడేరుకు చెందిన ఆశన్న(52) అనే వ్యక్తి సోమవారం మృతి చెందాడు. కాగా, బుధవారంనాడు వీరిలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 

26

వీరిలో మహబూబ్నగర్ అంబేద్కర్ కాలనీకి చెందిన  విష్ణు ప్రకాష్ (27), రేణుక (55) అనే మహిళ ఉన్నారు. కాగా మరో మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. బుధవారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అయితే, చనిపోయిన వారు కల్తీకల్లు వల్ల చనిపోలేదని వైద్యులు చెబుతున్నారని అన్నారు. వారు తాగిన కల్లు నమూనాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు. అందులో గనక కల్తీ జరిగినట్లు  తేలితే.. కల్లు కాంపౌండ్ నిర్వాహకులు, అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. 

36

బుధవారం తెల్లవారుజామునే విష్ణు ప్రకాష్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకోగా వారిని లోపలికి అనుమతించలేదు. చనిపోయిన విష్ణు ప్రకాష్ ఒంటరివాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి కూడా కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు.  తండ్రి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తుండేవాడు. తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం విష్ణు ప్రకాష్ కు వచ్చింది. ఇంకా వివాహం కాకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు.  

46

శుక్రవారం నాడు మహబూబ్నగర్ శివారులోని ఓ కాంపౌండ్ లో కల్లు తాగాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే అస్వస్థతకు లోనయ్యాడు. విషయాన్ని బంధువులకు చెప్పడంతో వెంటనే వారు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బుధవారం మరణించాడు.

56

అంతకుముందు సోమవారం మరణించిన ఆశన్న కూడా ఒంటరిగా ఉంటున్న వ్యక్తి.  అతనికి పెళ్లయింది, పిల్లలు ఉన్నారు. వారిని వదిలేసి దొడ్డలోనిపల్లెలో ఒంటరిగా ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం కళ్ళు తాగి పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు.

66

బుధవారం మరణించిన రేణుక, ఆశన్నలు సహజీవనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆశన్న, విష్ణు ప్రకాష్ ల మరణాలపై బంధువులు వేరువేరు కారణాలతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. మహబూబ్నగర్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆశన్నపై.. మహబూబ్నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో విష్ణు ప్రకాష్ లపై ఎఫ్ఐఆర్ లో నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కడ కూడా వారు కల్లు తాగి చనిపోయినట్లుగా తెలుపలేదు. 

click me!

Recommended Stories