నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును మరింత ముమ్మరం చేసింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ, రేపు కసరత్తు చేయనుంది. న్యూఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది.ఈ కమిటీ భేటీ నేపథ్యంలో ఆశావాహులు న్యూఢిల్లీ బాట పట్టారు.
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
ఇప్పటికే టీపీసీసీ అందించిన జాబితాపై పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు అందించిన సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల బలబలాలు, ఇతర ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్న ఆశావాహులు ఎంత కాలం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారనే అంశాన్ని పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై చేసిన పోరాటాలను కూడ టిక్కెట్టు కేటాయింపులో పరిగణనలోకి తీసుకొంటారు. అయితే బలమైన నేతల విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారు. ఇటీవలనే పార్టీలో చేరిన వారికి ఈ నిబంధనలు వర్తించవు. అంతేకాదు పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకోకున్నా కూడ వారికి టిక్కెట్లను కేటాయించనున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలకు ఈ రకమైన మినహాయింపులను ఇవ్వనున్నారు.
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
రాష్ట్రంలోని సుమారు 25 నుండి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్ధి పేరునే స్క్రీనింగ్ కమిటీకి చేరిందని సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో ఇద్దరు నుండి నలుగురి పేర్లు కూడ ఉన్నట్టుగా సమాచారం. అయితే ఎలాంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భావిస్తుంది.
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
మరో వైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కూడ టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బీసీ సామాజికవర్గానికి కనీసం 35 నుండి 40 అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు బీసీలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ హైద్రాబాద్ లో సమావేశమైంది.ఈ సమావేశంలో టీపీసీసీ అందించిన జాాబితాను షార్ట్ లిస్ట్ చేశారు.
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: ఆ స్థానాల్లోనే తొలుత అభ్యర్థుల ఎంపిక
ఈ నెల మొదటి వారంలో హైద్రాబాద్ లో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ న్యూఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఏకాభిప్రాయం కుదిరితే ఎలాంటి ఇబ్బందులు లేని 25 నుండి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే అవకాశం ఉంది