: 2023లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న కుంతియాకు బదులుగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాణికం ఠాగూర్ ను పార్టీ ఇంఛార్జీగా నియమించింది పార్టీ జాతీయ నాయకత్వం.
పార్టీ ఇంఛార్జీగా నియామకమైన తర్వాత ఠాగూర్ శనివారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో ఠాగూర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.మండల స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని 700 మండలాలకు ఒక ఇంఛార్జీని నియమించనున్నారు.
10 మండలాలకు ఒక్కో ఇంఛార్జీని నియమించనున్నారు. 2023 ఎన్నికల వరకు కూడ ఈ మండలాలకు వీరే ఇంఛార్జీలే కొనసాగుతారు. మండలాలవారీగా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
రాష్ట్రంలోని సమస్యలను గుర్తించనున్నారు. ఒక్కో సమస్యపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలు వేయనున్నారు. సబ్ కమిటీల సూచనల మేరకు ఆందోళనలను ప్లాన్ చేసే అవకాశం ఉంది.మండలాల స్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకొనేందుకు గాను ఠాగూర్ రాష్ట్రంలోని పలు మండలాల్లో పర్యటించనున్నట్టుగా ప్రకటించారు.
తమకు కేటాయించిన మండలాల్లో పార్టీని బలోపేతం చేసే పనిని నేతలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో మండలాల బాధ్యతలను తీసుకొనే నేతల జాబితాను సిద్దం చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదేశించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ఇప్పటి నుండే ఫోకస్ పెట్టింది. ఎన్నికలు జరిగే జిల్లాల నేతలతో పార్టీ ఇంఛార్జీ ఠాగూర్ ఎల్లుండి సమావేశం కానున్నారు.