పట్వారీగూడెంలో అనుచరులతో మాజీ ఎమ్మెల్యే జలగం భేటీ: హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

First Published May 21, 2023, 4:16 PM IST

ఖమ్మం  జిల్లాలోని  కొత్తగూడెం  మాజీ ఎమ్మెల్యే  జలగం వెకంటరావు  పట్వారీ గూడెంలో తన అనుచరులతో  సమావేశమయ్యారు. 

హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

జిల్లాలోని  పట్వారీగూడెంలో  మాజీ ఎమ్మెల్యే  జలగం  వెంకటరావు  అనుచరులతో  ఆదివారంనాడు సమావేశమయ్యారు.  పట్వారీ గూడెం గ్రామానికి  వెంకటరావు అనుచరులు  కార్లు, బైక్ లతో ర్యాలీగా  చేరుకున్నారు.  అయితే   ఎక్కడా  కూడా  బీఆర్ఎస్ జెండాలు పెట్టలేదు. మరో వైపు  కొత్తగూడెంలో  వనమా వెంకటేశ్వర్ రావు  నేతృత్వంలో బీఆర్ఎస్  ఆత్మీయ సమ్మేళనం  సాగుతుంది. 

హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

గతంలో  కొత్తగూడెం  అసెంబ్లీ స్థానం నుండి  జలగం  వెంకటరావు   ప్రాతినిథం వహించారు.  కొత్తగూడెం  నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  వనమా వెంకటేశ్వరరావు  2018లో   విజయం సాధించారు.   ఆ తర్వాత  చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  వనమా వెంకటేశ్వరరావు   కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో  చేరారు. 

హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

తొలి నుండి బీఆర్ఎస్ లో  ఉన్న జలగం  వెంకటరావు   మాత్రం  పార్టీ కార్యక్రమాలకు  దూరంగా  ఉంటున్నారు.  కానీ  ఇవాళ  జలగం వెంకటరావు  తన  అనుచరులతో  సమావేశం  నిర్వహించడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 

హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  టిక్కెట్లు  కేటాయిస్తామని  కేసీఆర్ ప్రకటించారు. కొత్తగూడెం  నుండి వనమా వెంకటేశ్వరరావు  ప్రస్తుతం  ఎమ్మెల్యేగా  ఉన్నారు.మరో వైపు  ఓ ప్రభుత్వ ఉద్యోగి  రిటైరై   బీఆర్ఎస్  నుండి పోటీ చేయాలనే  యోచిస్తున్నారు.  అంతేకాదు   కొత్తగూడెం  నియోజకవర్గంలో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

హీటెక్కిన కొత్తగూడెం రాజకీయాలు

ఇదిలా ఉంటే కొత్తగూడెంలో  పోటీకి  సీపీఐ  సన్నాహలు  చేసుకుంటుంది.  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని  ఆ పార్టీ  భావిస్తుంది.  వచ్చే  ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న స్థానాల్లో  కొత్తగూడెం  స్థానం కోరాలని సీపీఐ  భావిస్తుంది. గత ఎన్నికల్లో  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ  పొత్తులో భాగంగా  కొత్తగూడెం  సీటు  విషయమై  సీపీఐ తీవ్రంగా  పట్టుబడింది.  చివరి నిమిషంలో  ఈ స్థానాన్ని  కాంగ్రెస్ కు  సీపీఐ  వదిలేసింది. 

click me!