ఆరు హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

First Published | Dec 17, 2023, 2:00 PM IST

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.  ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్  ఇవాళ  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 
 
హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

రాష్ట్రంలో  కొత్తగా  అధికారాన్ని చేపట్టిన  కాంగ్రెస్ ప్రభుత్వం  ఆర్ధిక పరిస్థితిపై  ఫోకస్ పెట్టింది.  అధికారంలోకి రావడానికి దోహదం చేసిన  ఎన్నికల హామీలను అమలు చేసేందుకు అవసరమైన  ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడంపై కేంద్రీకరించింది. 

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్   ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో  భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో  ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కూడ పాల్గొన్నారు. 

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల  7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.  తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం దక్కింది.  భట్టి విక్రమార్కకే  ఆర్ధిక శాఖను  కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి  ప్రధానంగా  ఆ పార్టీ ఇచ్చిన  హామీలు కూడ ప్రధాన కారణంగా  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ హామీల అమలు కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సామేనని  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

  తెలంగాణ రాష్ట్ర ఖజానా నిండుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ హామీల అమలు ఎలా చేయాలనే దానిపై  కాంగ్రెస్ సర్కార్ సమాలోచనలు చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో  ఇటీవలనే  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.ఆర్ధిక పరిస్థితిపై  చర్చించారు. 

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

రాష్ట్ర ఆదాయం కూడ తగ్గింది. దీంతో  హామీల అమలుకు సంబంధించి అవసరమైన ఆర్ధిక వనరులపై కాంగ్రెస్ సర్కార్ కేంద్రీకరించింది. ఆర్ధిక వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఆదాయం పెంచుకొనే మార్గాలపై  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించింది.

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని వివరించి  అవసరమైన సూచనలు, సలహాలను ఆర్ధిక నిపుణుడు రఘురాం రాజన్ ను అడిగారు సీఎం రేవంత్ అతని మంత్రివర్గ సహచరులు.

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీల అమలుకు రూ. 60వేల కోట్లు అవసరం అవుతుందని  అధికారులు అంచనా వేశారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి  రైతు భరోసా,  మహిళలకు ప్రతి నెలా రూ. 2500 సహాయం, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ వెంటనే నిధుల అవసరం తప్పనిసరిగా మారింది.ఓఆర్ఆర్ లీజు సొమ్ము, ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులను కూడ గత సర్కారే  ఖర్చు చేసింది.  

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

రైతు భరోసాకు రూ. 15 వేలు  పంట పెట్టుబడి ఎకరానికి రూ. 7500 చొప్పున కోటి  50 లక్షల ఎకరాలకు ఇవ్వాలి. ఒక్క దఫాకే రూ. 11 వేల కోట్లు అవసరం కానుంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుండి  ఆదాయం తగ్గింది.

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో  అన్ని శాఖల్లో ఆర్ధిక పరిస్థితిపై వివరాలపై శ్వేత పత్రం ఇవ్వాలని అధికారులను  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.రాష్ట్రంలో  ఆర్ధిక  పరిస్థితిపై  శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.  తొమ్మిదిన్నర ఏళ్లలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్  ఏం చేసిందనే విషయాలను  ప్రజలకు వివరించాలని  రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.  అప్పులు తెచ్చి ఏం చేశారనే విషయాలను ప్రజలకు వివరించనున్నారు

హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు: ఎలా ? రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ

విద్యుత్ శాఖలో ఇప్పటికే రూ. 85 వేల కోట్ల అప్పులున్న విషయం తెలిసి  సీఎం రేవంత్ సహా మంత్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో  రేవంత్ రెడ్డి సర్కార్  ఆర్ధిక వనరులపై కేంద్రీకరించింది. దుబారాను కూడ నివారించాలని భావిస్తుంది.ఈ విషయాలపై  రఘురాం రాజన్ తో  రేవంత్ రెడ్డి  చర్చించారు. 

Latest Videos

click me!