15 వేల రూపాయలిస్తాం...: బడ్జెట్ 2024లో రేవంత్ సర్కార్ 

First Published | Jul 25, 2024, 2:59 PM IST

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ 2024 ప్రసంగంలో రైతు భరోసా గురించి ప్రస్తావించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఆయన ఏమన్నారంటే... 

Telangana Budget 2024

Telangana Budget 2024 : అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తెలంగాణ బడ్జెట్ 2024-25 కు ఆమోదం లభించింది. అనంతరం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

Telangana Budget 2024

ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. ఆరుగాలాలు కష్టించి సేద్యం చేస్తూ దేశప్రజల కడుపు నింపుతున్న అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. రైతు బాగున్నప్పుడే వ్యవసాయం రంగంలో అభివృద్ది సాధ్యమని నమ్ముతున్నామని... అందులో భాగంగానే పెట్టుబడి సమస్య లేకుండా రైతు భరోసా, పంట పండించి నష్టపోకుండా గిట్టుబాట ధర అందిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 


Telangana Budget 2024

ఎన్నికల్లో ప్రకటించినట్లు రైతు భరోసా కింద వ్యవసాయం చేసే రైతులకు ఎకరాకు రూ.15వేల చొప్పున అందిస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రియల్ ఎస్టేట్, సాగులో లేని, వందల ఎకరాలు కలిగిన భూస్వాములకు రైతు భరోసా ఇచ్చి ప్రజాధనం వృదా చేయదల్చుకోలేదని అన్నారు.  కాబట్టి రైతు భరోసా అర్హులైన రైతులకే అందిస్తామని...ఇందుకోసం విధివిధానాలను రూపొందించే పనిలో వున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా అర్హులపై నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 

Telangana Budget 2024

ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి. ఒకేసారి 31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నాం... అందులో భాగంగానే ఇప్పటికే లక్ష రూపాయల లోపు రుణాలున్న రూతులకు మాఫీ చేసామన్నారు.  త్వరలోనే రెండు లక్షలలోపు రుణాలన్నింటిని మాఫీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 
 

Telangana Budget 2024

వరిపంటను సాగుచేసే రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని భట్టి ప్రకటించారు. అయితే సన్నరకం వరి ధాన్యానికే ఈ బోనస్ వర్తిస్తుందని అన్నారు. 33 రకాల సన్నరకం వరి ధాన్యాలను గుర్తించామని...వాటిని పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. 

Latest Videos

click me!