ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే సభకు వచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు రూ. 57.84 లక్షల జీతం ఇచ్చామని అన్నారు. 15 నెలల్లో ఇంత ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ తీసుకున్నారని ఎద్దేవ చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ (KCR) తాకట్టు పెట్టారని విమర్శించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారన్న రేవంత్.. బీఆర్‌ఎస్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారన్నారు. గతంలో బలహీన వర్గాలకు చెందిన ఓ మహిళా గవర్నర్ ను అవమాన పరిచే విధంగా కేసీఆర్ ప్రవర్తించాన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్కరి వ్యక్తుల సొంతం కాదన్నారు.
నాగార్జునసాగర్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వస్తే ఆ సమయంలో కేసీఆర్ ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్‌ఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ నేతలు ఇలానే మాట్లాడేది అంటూ ధ్వజమొత్తారు.