కాంగ్రెస్ గెలుపు సర్వేల నుండి బిజెపి బిసి సీఎం వరకు : నెటిజన్ల సూటి ప్రశ్నలు, కవిత సమాధానాలివే..

First Published | Oct 29, 2023, 7:09 AM IST

#AskKavitha పేరిట ఎక్స్(ట్విట్టర్) వేదికన నెటిజన్ల నుండి ప్రశ్నలను స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత తనదైన రీతిలో సమాధానం చెప్పారు. 

Kalvakuntla Kavitha

హైదరాబాద్ : వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు కాంగ్రెస్ నేత భారత్ జోడో యాత్ర జరిగిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేసారు. ఏం చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని... మళ్ళీ ప్రజలు బిఆర్ఎస్ కే పట్టం కడతారని కవిత ధీమా వ్యక్తం చేసారు. కేవలం సర్వేల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుంది... ఎన్నికల్లో మాత్రం బిఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఈ విషయం 2018 ఎన్నికల్లోనే ప్రజలకు అర్థమయిపోయిందని... అయినా ఇదే ట్రిక్ ను కాంగ్రెస్ మళ్లీ వాడుతోందని కవిత అన్నారు. 

Kalvakuntla Kavitha

ఎక్స్(ట్విట్టర్) వేదికన #AskKavitha (ఆస్క్ కవిత) పేరిట నెటిజన్ల నుండి ప్రశ్నలు స్వీకరించిన కవిత వాటికి తనదైన రీతిలో సమాధానం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్ గెలుస్తుందంటూ వెలువడుతున్న సర్వేలు, బిజెపి బిసి  సీఎం హామీ, తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ గురించే కాదు డిల్లీ లిక్కర్ స్కామ్, చంద్రబాబు అరెస్ట్ గురించి కూడా కవిత స్పందించారు. 


MLC KAVITHA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ద్వారా కాంగ్రెస్, బిజెపి లకు సరైన సమాధానం చెబుతామని... ఈసారి కూడా గెలిచేది బిఆర్ఎస్ పార్టీయే అని కవిత అన్నారు. వందకు పైగా ఎమ్మెల్యేలను గెలుచుకుని సెంచరీ కొట్టడం ఖాయమని... కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. సర్వేల్లో కాంగ్రెస్ విజయం... బిజెపి బిసి సీఎం హామీ అన్ని ఎన్నికల జిమ్మిక్కులేనని కవిత పేర్కొన్నారు. 

MLC KAVITHA

తెలంగాణ ప్రజలు తెలివైనవారు... ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పాలనను చూసే నిర్ణయం తీసుకుంటారని కవిత అన్నారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలు, మోసపు హామీలను నమ్మబోరని అన్నారు. మరోసారి బిఆర్ఎస్ ను ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్దంగా వున్నారన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి... భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు వదులుకోరని అన్నారు. గత ఎన్నికల కంటే బంపర్ మెజారిటీ ఖాయమని... వందకు పైగా సీట్లు సాధించబోతున్నామని కవిత ధీమా వ్యక్తం చేసారు. 
 

Kavitha

ఇటీవల తన కుటుంబానికి తెలంగాణతో ఎంతో అనుబంధం వుందున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కవిత రియాక్ట్ అయ్యారు. రాహుల్ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రలో కలిపాడని... నాయనమ్మ ఇందిరాగాంధీ 1969లో స్వరాష్ట్రం కోసం పోరాటంచేసిన 369 మంది చావులకు కారణమయ్యిందని.... తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణకు చెందిన దళిత సీఎం అంజయ్యను అవమానించాడు... తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కితగ్గి వందలాది మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు... ఇదే కదా తెలంగాణతో మీ కుటుంబ అనుబంధం అంటూ కవిత ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రజలకు పదేపదే ద్రోహం చేయడమేనా అనుబంధం అంటే అంటూ రాహుల్ ను కవిత ప్రశ్నించారు.

Kavitha

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపైనా కవిత రియాక్ట్ అయ్యారు. ఈ వయసులో ఆయన అరెస్టయి జైల్లో వుండటం దురదృష్టకరమని అన్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు కుటుంబం అనుభవిస్తున్న బాధను తాను అర్థం చేసుకోగలనని కవిత పేర్కొన్నారు. 

Latest Videos

click me!