మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు కేటాయించినట్లు కవిత గుర్తుచేశారు. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చిన్నారులు, పలువురు సందర్శకులతో కవిత ఫోటోలు దిగారు.