దళిత బంధు అద్భుత పథకం..: కేసీఆర్ పై అంబేద్కర్ మనవడి ప్రశంసలు

Published : Apr 14, 2023, 02:13 PM ISTUpdated : Apr 14, 2023, 02:18 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంతో వెనకబడిన దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నాడని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. 

PREV
17
దళిత బంధు అద్భుత పథకం..: కేసీఆర్ పై అంబేద్కర్ మనవడి ప్రశంసలు
prakash Ambedkar

కరీంనగర్ : హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ 125 అడుగులు మహావిగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. 

27
prakash Ambedkar

హైదరాబాద్ కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్ ను మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. బేగంపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటారు. ఈ సందర్భంగా తన తాత అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ ను అభినందిస్తున్నట్లు ప్రకాశ్ అంబేద్కర్ పేర్కోన్నారు. 
 

37
prakash Ambedkar

అనంతరం బేగంపేట విమానశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి కరీంనగర్ జిల్లాకు బయలుదేరారు ప్రకాశ్ అంబేద్కర్. నేరుగా హుజురాబాద్ కు చేరుకున్న వారికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. 

47
prakash Ambedkar

హుజురాబాద్ లో తన తాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ప్రకాశ్ అంబేద్కర్. అనంతరం మంత్రి గంగులతో కలిసి దళిత బంధు ద్వారా లబ్దిదారులు పొందిన యూనిట్లను ఆయన పరిశీలించారు. 
 

57
prakash Ambedkar

దళిత బంధు దేశంలోనే ఒక మంచి పథకమని... ఇది వెనకబడిన దళితుల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని అన్నారు. దళితులకు అండదండలు అందిస్తూ ఇలాంటి పథకం ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రకాశ్ అంబేద్కర్. 

67
prakash Ambedkar

దళిత బంధు లబ్దిదారులే ఆర్థికంగా లాభపడ్డామని స్వయంగా తనతో చెప్పారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా దళిత బంధు లాంటి  పథకం అమలు చేయాలని... తద్వారా ఆయా రాష్ట్రాల్లోనూ వెనకబడిన దళితులు లాభపడతారని భావిస్తున్నానని అన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్న అధికారులను కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

77
prakash Ambedkar

ఇతర కులాల్లో కూడా ఆర్థికంగా వెనకబడిన వారికోసం ఇటువంటి మరిన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. 

click me!

Recommended Stories