మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
ఈ నెలాఖరు నుండి యాత్రలు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. మూడు ప్రాంతాల నుండి ముగ్గురు నేతలు యాత్రలను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలను ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైద్రాబాద్ లో ముగించనున్నారు.ఈ మేరకు రూట్ మ్యాపులను సిద్దం చేస్తున్నారు.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
బాసర, భద్రాచలం, ఆలంపూర్‌ల నుండి బీజేపీ నేతలు యాత్రలను ప్రారంభించనున్నారు. ఒక్కో రూట్‌లో 36 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించేలా నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు.ప్రతి రూట్ లో బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్ లు ఈ యాత్రలకు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమల దళం వ్యూహరచన చేస్తుంది.ఈ క్రమంలోనే బస్సు యాత్రలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీకి మంచి విజయావకాశాలున్నాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ మేరకు తెలంగాణపై బీజేీపీ నాయకత్వం కేంద్రీకరించింది.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
ఈ క్రమంలోనే క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. సంస్థాగత మార్పుల్లో భాగంగా బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది కమలదళం.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
యాత్రల ముగింపును పురస్కరించుకొని సెప్టెంబర్ 17న నిర్వహించే ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని ఆ పార్టీ భావిస్తుంది.గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలను నిర్వహించారు. ఈ యాత్రలకు బీజేపీ నుండి రెస్పాన్స్ వచ్చింది.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంది. గోషామహల్ నుండి రాజాసింగ్ ఒక్కరే అసెంబ్లీలో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుండి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను దక్కించుకుంది.
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ
అయితే ఈ దఫా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కాషాయ పార్టీ కార్యాచరణను సిద్దం చేస్తుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత టీమ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దక్షిణాదిలో గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. అయితే కర్ణాటకలో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అయితే తెలంగాణలో అధికారంపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.