తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

First Published | Aug 17, 2023, 11:29 AM IST

తెలంగాణలోని మద్యం దుకాణాలకు  భారీగా రెస్పాన్స్ వస్తుంది.  ఇప్పటికే  42 వేలకు పైగా ధరఖాస్తులు అందాయి. రేపటిలోపుగా  ఇంకా  ధరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు అం

తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

తెలంగాణలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్ కు  భారీగా  రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పటివరకు 42 వేల ధరఖాస్తులు అందాయి.  రేపటితో  లైసెన్సుల కోసం ధరఖాస్తులకు  అవకాశం కల్పించింది ప్రభుత్వం.ఈ నెల  4వ తేదీ నుండి  18వ తేదీ వరకు  మద్యం దుకాణాల  లైసెన్సుల కోసం  ధరఖాస్తులను  తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్వీకరిస్తుంది

తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

2023-25 సంవత్సరానికి మద్యం దుకాణాలకు లైసెన్సుల కోసం ఎక్సైజ్  శాఖ  ధరఖాస్తులను స్వీకరిస్తుంది.ఈ దఫా 50 వేల వరకు  ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.  2021-23  లో రాష్ట్రంలోని  2,620  మద్యం దుకాణాలకు   37,500 ధరఖాస్తులు అందాయి.   ధరఖాస్తుల విక్రయం వల్లే  గతంలో  రూ. 750  కోట్ల ఆదాయం  ప్రభుత్వానికి అందింది.  అయితే  ఈ ఏడాది ఇప్పటి వరకు   ధరఖాస్తుల విక్రయం ద్వారా రూ. 840 కోట్ల ఆదాయం దక్కింది.   ఇంకా చివరి రెండు రోజులు ధరఖాస్తు చేసుకొనేందుకు  అవకాశం ఉంది. దీంతో  ఈ రెండు రోజుల్లో  భారీగా ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖాధికారులు విడుదల చేయనున్నారు. నిన్న రోజే  8,500 ధరఖాస్తులు వచ్చాయి.
 
తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

ఒక్కో షాపునకు  50 నుండి 200 వరకు ధరఖాస్తులు అందాయని   అధికారులు చెబుతున్నారు.  ఈ నెల 21న లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను  కేటాయింపుచనున్నారు.20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో  మద్యం దుకాణం లైసెన్సు కోసం  రూ. 1.10 కోట్లను నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని కొకొన్ని మద్యం దుకాణాలకు  భారీగా టెండర్లు  దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు 20 కంటే ధరఖాస్తులు అందితే  ఆ మద్యం దుకాణానికి మళ్లీ టెండర్లను  పిలవాలని  అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

గతంలో కంటే  ధరఖాస్తుల ద్వారానే  రాష్ట్ర ప్రభుత్వానికి  అధికంగానే  ఆదాయం వస్తుంది.  ఎన్నికలకు ముందే మద్యం దుకాణాల లైసెన్సుల  రెన్యూవల్ కు సంబంధించి  టెండర్లు  పిలవడంపై  విపక్షాలు విమర్శలు  చేస్తున్నాయి.   మద్యం  ద్వారానే  అధిక ఆదాయం సంపాదించుకొనేందుకు  రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  

తెలంగాణలో మద్యం లైసెన్సుల రెన్యూవల్ కు భారీ స్పందన: 42 వేల ధరఖాస్తులతో రూ.840 కోట్ల ఆదాయం

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  మద్యం దుకాణాలు దక్కించుకున్నవారికి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే  ప్రధానమైన  సెంటర్లలోని  మద్యం దుకాణాలకు  పోటీ పడి ధరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Latest Videos

click me!