నాగార్జునసాగర్ బైపోల్: అభ్యర్ధి ఎంపికలో బీజేపీ వ్యూహాం ఇదీ..

First Published Feb 28, 2021, 1:13 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు కేంద్రీకరించాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్ధి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
undefined
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో మరణించారు. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
undefined
ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.
undefined
టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇంకా తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది.
undefined
టీఆర్ఎస్ లో ఈ సీటు కోసం పలువురు పోటీ పడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ కూడా ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.
undefined
ఎమ్మెల్సీ తేర చిన్నప్పరెడ్డి, పార్టీ నేతలు కోటిరెడ్డితో పాటు పలువురి నేతల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వానికి నోముల కుటుంబానికి సీటివ్వాలని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు కోరారు.
undefined
ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని ఇంకా టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించలేదు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం తన అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలుపోందారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ 48 కార్పోరేటర్ స్థానాలను దక్కించుకొంది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించాలని కమలదళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ రెండు రోజుల క్రితం నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి చెందిన నేతలతో సమావేశమయ్యారు. సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.
undefined
గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన నివేదిత రెడ్డి మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీ నుండి ఈ స్థానం నుండి పోటీ చేసిన అంజయ్య యాదవ్ ప్రస్తుతం బీజేపీలో చేరారు.
undefined
అంజయ్య యాదవ్ కూడా ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీకి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇతరుల పేర్లను కూడ బీజేపీ పరిశీలిస్తోంది.
undefined
సినీ నటి విజయశాంతి కూడ ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడ ప్రచారంలోకి వచ్చింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను నాగార్జునసాగర్ నుండి పోటీ చేయనని ప్రకటించారు.
undefined
టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలకు బీజేపీ గాలం వేసిందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ తన అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
click me!